పెళ్లి చేసుకోండి.. డేటింగ్ యాప్ ఖర్చులు మేమే భరిస్తాం..యువతకు ప్రభుత్వ ఆఫర్!

పెళ్లి చేసుకోండి.. డేటింగ్ యాప్ ఖర్చులు మేమే భరిస్తాం..యువతకు ప్రభుత్వ ఆఫర్!


ప్రస్తుత కాలంలో చాలా దేశాలు జనాభా పెరుగుదలను అరికట్టడానికి ప్రయత్నిస్తుంటే, జపాన్ మాత్రం అందుకు విరుద్ధంగా జనాభాను పెంచడానికి వినూత్న దారులను వెతుకుతోంది. జపాన్‌లో యువత పెళ్లిళ్ల పట్ల, పిల్లలను కనడం పట్ల విముఖత చూపుతుండటంతో జననాల రేటు రికార్డు స్థాయిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో జపాన్‌లోని కోచి ప్రావిన్స్ ప్రభుత్వం యువతను ప్రేమలో పడేలా ప్రోత్సహించడానికి మీటింగ్ సపోర్ట్ ప్రాజెక్ట్ గ్రాంట్ పేరుతో ఒక ఆసక్తికరమైన పథకాన్ని ప్రారంభించింది.

డేటింగ్ యాప్‌లకు సబ్సిడీ:

ఆర్థిక భారమో లేదా కెరీర్ పట్ల అతిగా శ్రద్ధ చూపడమో కానీ, జపాన్ యువత డేటింగ్, సంబంధాలకు దూరంగా ఉంటున్నారు. దీనిని మార్చడానికి 20 నుండి 39 ఏళ్ల మధ్య వయస్సు గల అవివాహితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. డేటింగ్ యాప్‌లలో రిజిస్ట్రేషన్ ఫీజు లేదా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ కోసం అయ్యే ఖర్చులో ఏడాదికి 20,000 యెన్ల (దాదాపు 11,700 రూపాయలు) వరకు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో తిరిగి ఇస్తుంది.

జనాభా సంక్షోభం తీవ్రత:

గణాంకాల ప్రకారం, 2025లో జపాన్‌లో కేవలం 7 లక్షల మంది పిల్లలు మాత్రమే జన్మించారు. ఇది ఇప్పటివరకు నమోదైన అతి తక్కువ సంఖ్య. మరోవైపు వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటంతో భవిష్యత్తులో దేశ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం యాప్‌లే కాకుండా, నేరుగా కలుసుకునేలా (Offline Dating) ఈవెంట్లను నిర్వహించే సంస్థలకు కూడా ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ లక్ష్యం:

డిజిటల్ మాధ్యమాల ద్వారా యువత సులభంగా తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకోవచ్చని ప్రభుత్వం సూచిస్తోంది. మీరు కేవలం ప్రేమను వెతుక్కోండి.. దానికి అయ్యే ఖర్చు మేము చూసుకుంటాం అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ వినూత్న ప్రయోగం ద్వారా జపాన్ తన జనాభా సంక్షోభం నుండి గట్టెక్కుతుందో లేదో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *