పులిగుండాల అడవుల్లో చిరుతలు.. ట్రాప్ కెమెరాలో అరుదైన దృశ్యాలు

పులిగుండాల అడవుల్లో చిరుతలు.. ట్రాప్ కెమెరాలో అరుదైన దృశ్యాలు


ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు మండలాల్లో విస్తరించిన కనకగిరి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సందడి పెరిగింది. తాజాగా పులిగుండాల అటవీ ప్రాంతంలో రెండు చిరుత పులులు సంచరిస్తూ అటవీశాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. ఒక జంతువు కళేబరం చుట్టూ ఈ రెండు చిరుతలు తిరుగుతున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. గత నెలలో చిరుత తన పిల్లలతో ఆడుకుంటున్న వీడియోలను అటవీ శాఖ అధికారు లు విడుదల చేయగా, ఒక జంతువు కళేబరం చుట్టూ ఈ రెండు చిరుతలు తిరుగుతున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. తాజాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అటవీ ప్రాంతంలో చిరుతలే కాకుండా జింకలు, దుప్పులు వంటి ఎన్నో రకాల వన్యప్రాణులు సమృద్ధిగా ఉండటం ఇక్కడి పర్యావరణ సమతుల్యతకు నిదర్శనమని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ స్పందిస్తూ.. “అటవీ ప్రాంతంలోని సంపన్న జీవవైవిధ్యం, ఆరోగ్యవంతమైన వాతావరణం ఇక్కడ పర్యావరణ సమతుల్యతకు సానుకూల సూచన అన్నారు. ఒకే ఆవాసంలో వేర్వేరు జాతులకు చెందిన జంతువులు సంచరించడం ఇక్కడి అడవులు ఎంత సురక్షితంగా ఉన్నాయో చెబుతున్నాయి అని తెలిపారు. అడవులను, వన్యప్రాణులను కాపాడుకోవడం మానవ మనుగడకు అత్యంత అవశ్యకమని ఆయన పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారుల నిరంతర పర్యవేక్షణ, రక్షణ చర్యల వల్లనే ఇక్కడ వన్యప్రాణులు సురక్షితంగా జీవించగలుగుతున్నాయని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jio: జియో నుంచి వారి కోసం స్పెషల్ గా రూ.459 సరికొత్త ప్లాన్‌..!

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కష్టాలు..’నో స్టాక్’ బోర్డులతో అల్లాడుతున్న ప్రజలు

ఏడు కొండలపై టెక్నాలజీ విప్లవం.. ఆ 7 అద్భుతాలు ఏంటి ??

ఆ చిన్న మార్పు చేసుంటే.. ఉస్తాద్ ఇంకా బాగా ఆడేది

Kalyan Padala: హీరోగా కళ్యాణ్‌ పడాల.. మొదటి అడుగు పడింది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *