Andhra Pradesh: నిప్పుల కొలిమిలా ఆంధ్రప్రదేశ్‌.. వాతావరణ శాఖ హై అలర్ట్

Andhra Pradesh: నిప్పుల కొలిమిలా ఆంధ్రప్రదేశ్‌.. వాతావరణ శాఖ హై అలర్ట్


ఆంధ్రప్రదేశ్‌ను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భానుడి భగభగలతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా వాతావరణ శాఖ మరియు విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. రాష్ట్రంలో 23 మండలాల్లో ప్రమాదకరమైన స్థాయిలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మరో 26 మండలాల్లో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ఈ ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 49 మండలాల్లో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు వాతావరణశాఖ అధికారులు. ప్రధానంగా ఉత్తరాంధ్ర మరియు రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విజయనగరం జిల్లాలో 8 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 , అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతాలు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, మార్కాపురం , వైఎస్ఆర్ కడప జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత నమోదు అయ్యే అవకాశం ఉంది. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని.. ప్రభుత్వం , వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. శరీరం డీ హైడ్రేషన్‌ బారినపడకుండా ఉండేందుకు దాహం వేయకపోయినా క్రమం తప్పకుండా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ లాంటి ద్రావణాలను తీసుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు. ఎండలో వెళ్లాల్సి వస్తే కాటన్ దుస్తులు ధరించాలని,గొడుగు లేదా టోపీని తప్పనిసరిగా వాడాలని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ, ఎండల తీవ్రతను తక్కువ అంచనా వేయకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Seshachalam Forest: శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..

సూర్యకి గుండుగీయించి ఊరేగిస్తాం.. దర్గా చిన్న పహిల్వాన్ వార్నింగ్

Weather Update: సెగలు పుట్టిస్తున్న సూర్యుడు.. అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల జనం

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌..! తెలంగాణ లో ఉచిత బ్యాంకింగ్ కోచింగ్

Paytm: పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. లైసెన్స్ రద్దు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *