మారుతున్న అలవాట్ల రోజుల్లో అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయ.అయితే, తినే ఆహారం చాలా ముఖ్యం. ఏది తింటున్నామో ? ఏది తినడం లేదో ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఆ తర్వాతే తినాలి ఏది పడితే అది తింటే అనారోగ్య సమస్యలు పాలవుతారు. బయట ఫుడ్స్ కన్నా ఇవి తింటే మీ గుండె ఆయుష్షు కూడాపెరుగుతుంది.
అవిసె గింజలు చూడటానికి చాలా బుడ్డిగా ఉంటాయి కానీ, వీటిని తింటే వచ్చే శక్తి అంతా ఇంతా కాదు పక్షవాతం రాకుండా ఉండాలంటే వీటిని తప్పక తినాలి. ఇంకా ఈ సీడ్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కళ్ళ సమస్యలను కూడా దూరం చేస్తాయి.
కాబట్టి, వీటిని ఇప్పటి వరకు తినని వాళ్ళు తింటే మంచి ఫలితం ఉంటుంది.
అవిసె గింజల్లో ఉండే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఈ గింజలు మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తాయి. ఇది మొక్కల నుంచి వస్తుంది కాబట్టి దీనిలో సహజ ప్రోటీన్స్ ఉంటాయి ఇలాంటివి తింటూ ఉండాలి
అయితే, వీటిని నానాబెట్టి తీసుకోవడం కంటే వేయించి పొడి రూపంలో తీసుకోవాలని అంటున్నారు. దీనిని మీ ఆహారంలో తీసుకుంటే
భాగంగా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది చర్మం, జుట్టు రాలడం సమస్యలను కూడా తగ్గిస్తుంది
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




