Headlines

నేను మాట్లాడైన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు..


నా వల్ల స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మాటలు పడ్డారు అని ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి గతంలో ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. తన కెరీర్ ఆరంభం నుంచి నేర్చుకున్న పాఠాలు, చేసిన తప్పులు, వాటి నుంచి ఎలా బయటపడ్డారు అనే విషయాలపై ఆయన స్పందించారు. తన మొదటి చిత్రాలలో ఒకటైన గీతాంజలి ప్రమోషన్స్ సమయంలో తన పోస్టర్ లేకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బ్రహ్మానందం, అంజలి వంటి ప్రముఖులు ఉన్నందున తన అవసరం లేదని చిత్రబృందం భావించిందని, ఆ సమయంలో కోన వెంకట్ గారు ప్రమోషన్స్ విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ఉన్నారని శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఒక సినిమా హిట్టయ్యాకనే తన, అంజలి ఫోటోలను పోస్టర్లపై వేయడం జరిగిందని తెలిపారు.

నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ

ఇంటర్వ్యూలో ప్రధానంగా ప్రస్తావించిన అంశం ఒక సినిమా సక్సెస్ మీట్‌లో శ్రీనివాస్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్య. “బాల్ పిసుక్కోవడం” అనే తన మాట తప్పుగా అర్థం చేసుకోబడిందని, అది ప్రజల్లోకి వల్గర్‌గా చేరిందని ఆయన అన్నారు. “100కి 100 శాతం నాదే తప్పు. వాడిన పదం చాలా రాంగ్” అని ఒప్పుకున్నారు. తాను మాట్లాడిన ఉద్దేశ్యం, అది ప్రజల్లోకి వెళ్ళిన విధానం మధ్య వ్యత్యాసం ఉందని, ఈ సంఘటన తర్వాత తాను తీవ్రంగా పశ్చాత్తాపపడ్డానని తెలిపారు. ఈ వ్యాఖ్యల వల్ల దర్శకుడు త్రివిక్రమ్ గారికి కూడా చెడ్డ పేరు వచ్చిందని, ప్రజలు త్రివిక్రమ్ గారే అలా చెప్పించారని అనుకున్నారని ఆవేదన చెందారు.

అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది

అందుకు త్రివిక్రమ్ గారికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈ సంఘటన తన వ్యక్తిగత ఎదుగుదలకు, మాట తీరులో మార్పు రావడానికి ఒక ముఖ్య కారణమని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బహిరంగ వేదికలపై ఎలా మాట్లాడాలి, ఎలాంటి పదాలు వాడాలి అనే విషయాలపై ఈ అనుభవం తనకు స్పష్టతనిచ్చిందని పేర్కొన్నారు. తన నోటి దూల తగ్గడానికి బ్రహ్మానందం గారు కూడా ఒక కారణమని, ఆయన సలహాలు తనలో ఎంతో మార్పు తీసుకొచ్చాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి



ఆ సినిమాలో ఛాన్స్ అడిగితే ఆ హీరో వద్దు అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన రాజశేఖర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *