Headlines

నషా ముక్త్ భారత్.. హైదరాబాద్‌లో కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం.. లైవ్ వీడియో


కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి చేపట్టిన నషా ముక్త్‌ భారత్‌ పాదయాత్ర ప్రారంభం అయింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌ నుంచి జూబ్లీహిల్స్ వరకు జరగనున్న ఈ 30కిలోమీటర్ల పాదయాత్ర నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగుతుంది. హైదరాబాద్ వాక్ ఫర్ నషా ముక్త భారత్ పేరిట ఈ పాదయాత్ర చేపట్టారు కిషన్‌రెడ్డి. అంబర్‌పేట్‌లోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం జెండా ఊపి పాదయాత్ర ప్రారంభిస్తారు.. ఈ పాదయాత్రకు విద్యార్థులు సహా.. జనం భారీగా తరలివచ్చారు.

పాదయాత్ర ప్రారంభోత్సవంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుతో పాటు ఎంపీ లక్ష్మణ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ నటుడు విక్టరీ వెంకటేష్ పాల్గొంటారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర టాలీవుడ్ యాక్టర్స్‌ నిఖిల్ సిద్ధార్థ్, పాయల్ రాజ్‌పుత్ యాత్రలో పాల్గొంటారు. చిలకలగూడ చౌరస్తాలో శంకర్ స్వామీజీ, యోగేష్ ప్రభుజీ, శివస్వామి, విశ్వాత్మానంద గిరి, కృష్ణ చాముండేశ్వర మహర్షి, ఆత్మారాం మహారాజ్ ఈ యాత్రకు మద్దతు తెలుపుతారు.

ఒక పాదయాత్రతో, ఒక మీటింగ్‌తో డ్రగ్స్‌ సమస్య పరిష్కారం కాదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. 140 కోట్ల మంది ప్రజలు ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. డ్రగ్స్‌ నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందన్నారు. ఇది రాజకీయ లబ్ది పొందే కార్యక్రమం కాదన్న కిషన్ రెడ్డి.. దేశ రక్షణ, యువత భవిష్యత్తు కోసం అంతా కలిసి పని చేస్తామన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *