Headlines

ఢిల్లీలో దారుణం.. సహ ఉద్యోగిపై సాముహిక అత్యాచారం.. ఐదుగురు అరెస్ట్


తోటి ఉద్యోగినిపైనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. ప్రీత్ విహార్ ప్రాంతంలో 22 ఏళ్ల యువతిపై జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.కేఫ్‌లో పనిచేస్తున్న సహోద్యోగులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే..ఢిల్లీలోని కర్కర్‌డూమా క్రాస్ రివర్ మాల్‌లో ఉన్న కేఫ్ 8 లో పనిచేస్తున్న 22 ఏళ్ల యువతిపై అదే కేఫ్‌లో పనిచేస్తున్న 8 మంది ఆమెతో స్నేహంగా ఉంటూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి కేఫ్ మూసివేసిన అనంతరం ఎనిమిది మంది కలిసి తాళం తీసి లోపల పార్టీ చేసుకున్నట్లు సమాచారం.

అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.అక్కడే ఉన్న మిగతా సహోద్యోగులు కూడా ఈ దారుణానికి సహకరించినట్లు తెలుస్తోంది.స్నేహితులుగా నమ్మినవారే ఇలాంటి ఘాతుకానికి పాల్పడటంతో బాధితురాలు తీవ్ర ఆవేదనకు గురైంది.

తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఈ ఘటన సంబంధించిన సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *