Headlines

డ్యూయల్ 200MP కెమెరాతో HONOR Magic9 Pro Max.. లాంఛ్ ఎప్పుడంటే ??


ప్రముఖ టెక్నాలజీ సంస్థ HONOR.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, నూతన టెక్నాలజీతో మొబైళ్లను అందిస్తూ టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ, స్టోరేజ్ సహా పలు సెగ్మెంట్ లలో మీడియం బడ్జెట్ లోనే ఫ్లాగ్ షిప్ స్థాయిలో స్మార్ట్‌ఫోన్లను రూపొందిస్తోంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ HONOR Magic9 Pro Maxను అంతర్జాతీయ మార్కెట్లలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

కాగా ఇప్పటికే చైనా మార్కెట్‌లో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌కు మంచి స్పందన లభిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో హాంకాంగ్‌లోనూ లాంచ్ చేసిన ఈ ఫోన్‌కు ఇప్పటివరకు 5 లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాలు నమోదైనట్లు తెలిపింది. ఈ క్రమంలోనే నవంబర్ 24న మలేషియాలో ఈ మొబైల్ ను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆగ్నేయాసియా వంటి ఇతర దేశాల్లోనూ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా ఈ ఫోన్‌లో ప్రధానంగా కెమెరా గురించి చర్చ నడుస్తోంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ 200MP కెమెరాను అందించడం హాట్ టాపిక్ గా మారింది.

HONOR Magic9 Pro Max ఫీచర్స్..

డిజైన్..

HONOR ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ డిజైన్‌లో కీలక మార్పులు చేసింది. గతంలో మ్యాజిక్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో కనిపించిన గుండ్రటి కెమెరా మాడ్యూల్ స్థానంలో ఈసారి చతురస్రాకార కెమెరా హౌసింగ్‌ను అందించింది. ఫోన్ వెనుక భాగంలో కెమెరా సెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

కెమెరా..

ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా విభాగానికి కంపెనీ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రముఖ సినిమా కెమెరా పరికరాల తయారీ సంస్థ ARRI సహకారంతో కెమెరా టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇందులో సెన్సార్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో కూడిన 200MP ప్రైమరీ కెమెరాను అందించింది. ప్రధాన కెమెరాతో పాటు 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కూడా అందించారు. దూరంలోని వస్తువులను జూమ్ చేసి ఫొటోలు తీయడానికి ఈ కెమెరా ఉపయోగపడుతుంది. వీటితో పాటు 50MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది.

అలానే సెల్ఫీ కోసం 55MP కెమెరాను తీసుకొచ్చింది. వీడియో రికార్డింగ్ కోసం కూడా ప్రత్యేక ఫీచర్లను అందించింది. ARRI LogC3 కర్వ్ రికార్డింగ్, ARRI Looks, ప్రొఫెషనల్ LUT ప్రొఫైల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా మొబైల్‌తోనే సినిమాటిక్ వీడియోలు చిత్రీకరించి, ప్రొఫెషనల్ స్థాయిలో ఎడిటింగ్ చేయాలనుకునే వారికి ఇవి ఉపయోగపడనున్నాయి. దీంతో ఫొటోగ్రఫీ ప్రియులకు ఈ ఫోన్ మంచి ఎంపికగా నిలిచే అవకాశం ఉంది.

డిస్‌ప్లే..

ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను అందించారు. అడాప్టివ్ హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటంతో వినియోగదారులకు స్మూత్ స్క్రోలింగ్, మెరుగైన విజువల్ అనుభూతి లభించనుంది. వీడియోలు చూడటం, గేమింగ్ వంటి అవసరాలకు ఈ డిస్‌ప్లే ఉపయోగపడుతుంది.

ప్రాసెసర్..

పనితీరు కోసం Qualcomm Snapdragon 8 Elite Extreme Gen 6 చిప్‌సెట్‌ను అందించారు. ఈ ప్రాసెసర్‌తో మల్టీటాస్కింగ్, గేమింగ్, ఇతర హై-పెర్ఫార్మెన్స్ పనులను వేగంగా నిర్వహించవచ్చని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

16GB ర్యామ్..

మెమొరీ విభాగంలో గరిష్ఠంగా 16GB ర్యామ్‌తో పాటు 1TB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లోనూ అందుబాటులో ఉండనుంది.

బ్యాటరీ..

బ్యాటరీ విషయంలో HONOR అధిక ఎనర్జీ డెన్సిటీ కలిగిన సిలికాన్-కార్బన్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించింది. కానీ బ్యాటరీ మొత్తం సామర్థ్యం (mAh) వివరాలను ఇంకా వెల్లడించలేదు.

100W వైర్డ్ & 80W వైర్‌లెస్ ఛార్జింగ్..

ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 100W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. అలాగే 80W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. దీంతో వైర్డ్, వైర్‌లెస్ రెండు విధాలుగా వేగంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు.

ధర & లాంచ్ వివరాలు..

HONOR Magic9 Pro Max ధర, స్థానిక వారంటీ వివరాలు, ప్రీ-ఆర్డర్ ఆఫర్లను నవంబర్ 24న జరిగే మలేషియా లైవ్ లాంచ్ ఈవెంట్‌లో వెల్లడించనుంది. ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఫోన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలపైనా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఆఫర్స్..

ఇక మలేషియాలో విడుదలకు ముందే HONOR ప్రత్యేక ప్రీ-రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో నిర్వహించే సర్వేలో పాల్గొనే వారికి ఐదు HONOR Choice Watch 2 Epic స్మార్ట్‌వాచ్‌లను గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. అంతేకాకుండా అధికారిక ఛానళ్ల ద్వారా లాంచ్ తర్వాత ఈ ఫోన్ కొనుగోలు చేసే రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారులకు 2X Points Boost Voucher కూడా అందించనుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *