Headlines

టాలీవుడ్‌లో కాంటెంపరరీ కథలకు బ్రేక్.. స్టార్ హీరోలందరూ పీరియాడిక్, ఫ్యూచరిస్టిక్ బాటే ఎందుకు?

టాలీవుడ్‌లో కాంటెంపరరీ కథలకు బ్రేక్.. స్టార్ హీరోలందరూ పీరియాడిక్, ఫ్యూచరిస్టిక్ బాటే ఎందుకు?


పాన్ ఇండియా లెవల్లో టాలీవుడ్‌ సత్తా చాటుతోంది. కానీ, ఇప్పుడు టాలీవుడ్‌లో వస్తున్న సినిమాలన్నీ ఒకే పాటర్న్‌లో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కాంటెంపరరీ కథలతో బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన మన హీరోలు, ఇప్పుడు పూర్తిగా రూటు మార్చేశారు. కాంటెంపరరీ టైమ్‌ లైన్స్‌ దూరంగా అయితే పీరియాడిక్‌ లేదంటే ఫ్యూచరిస్టిక్ సినిమాలతో ఆడియన్స్‌ ముందుకు వస్తున్నారు. అసలు మన హీరోలు మళ్లీ మన టైమ్‌ లైన్స్‌లో కనిపించేదెప్పుడు..? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా పీరియాడిక్ లేదా ఫ్యూచరిస్టిక్ కథలతో వస్తున్న సినిమాలే కనిపిస్తున్నాయి. స్టార్ హీరోలంతా మన టైమ్ లైన్స్‌ను వదిలేసి, వందేళ్ల వెనక్కి లేదా వందేళ్ల ముందుకు వెళ్లిపోవడంతో కాంటెంపరరీ కథలు కరువయ్యాయి. కథలో కొత్తదనం పేరుతో రియాలిటీకి దూరంగా ఉండే ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ మూవీస్ చేస్తున్నారు స్టార్స్‌. దీంతో కాంటెంపరరీ కథల్లో మన హీరోలు కనిపించే రోజులు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్‌. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టిన ‘కల్కి’ సినిమా పూర్తిగా ఫ్యూచరిస్టిక్ టైమ్ లైన్‌లో జరిగిన కథగా ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. ఇదే సినిమాలో మహాభారత కాలం నాటి అంశాలతో మైథలాజికల్ టచ్‌ కూడా ఇచ్చారు మేకర్స్‌. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న ‘రాకా’ లాంటి సినిమాలు కూడా అదర్‌ వరల్డ్స్, పీరియాడిక్ సెటప్స్‌లోనే వస్తున్నాయి. పాన్ ఇండియా అప్పీల్, బిగ్ కాన్వాస్ పేరుతో స్టార్స్ అంతా ఇలాంటి కథల వైపే మొగ్గుచూపడంతో, రెగ్యులర్ రియలిస్టిక్ డ్రామాలు తగ్గిపోతున్నాయి. అప్‌కమింగ్ లిస్ట్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’, ఎన్టీఆర్‌ ‘డ్రాగన్’ లాంటి సినిమాలు కూడా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లోనే రూపొందుతున్నాయి. పాత కాలం నాటి సెట్టింగ్స్, అప్పటి గెటప్స్‌లోనే మన హీరోలు సందడి చేయబోతున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, లార్జర్ దేన్ లైఫ్ ఎలివేషన్స్ కోరుకునే దర్శకులు సినిమాటిక్ లిబర్టీ కోసమే ఇలాంటి టైమ్ లైన్స్ ఎంచుకుంటున్నారా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. మన టాలీవుడ్ పరిస్థితి ఇలా ఉంటే, పక్క ఇండస్ట్రీలైన బాలీవుడ్, కోలీవుడ్‌, మాలీవుడ్‌లో మాత్రం స్టార్స్ కొత్త ప్రయోగాలు చేస్తూనే, కాంటెంపరరీ కథల్లో అదరగొడుతున్నారు. కరెంట్ ఇష్యూస్ బేస్ చేసుకుని మన చుట్టూ జరిగే రియలిస్టిక్ కథలతో మ్యాజిక్ చేస్తున్నారు. ఇతర భాషల వాళ్లు ప్రయోగాలను, కాంటెంపరరీ కథలను బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు.. మన తెలుగు స్టార్స్ మాత్రం ఈ కథలను పక్కన పెట్టేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షూటింగ్‌లతో ఫుల్ బిజీ టాలీవుడ్.. స్టార్ హీరోలందరూ సెట్స్‌పైనే

Anupama Parameswaran: ‘నా గొంతు నేనే వినిపిస్తా’.. అనుపమ ఎమోషనల్ పోస్ట్ వెనక అసలు కథ ఏంటి?

Mamitha Baiju: నెల రోజుల్లో మూడు భారీ సినిమాలు.. మమిత బైజు దండయాత్రకు రెడీ!

Ramayana Leak: ‘రామాయణ’ ట్రైలర్ లీక్ వెనక అసలు కథ ఏంటి..? పైరసీనా.. ప్రమోషన్ ప్లానా?

Bhagyasree Borse: ‘ఐరెన్ లెగ్’ అంటూ నన్నే ఎందుకు..? హిట్ తర్వాత భాగ్యశ్రీ బోర్సే ఘాటు కౌంటర్!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *