ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన విజయ మోహన్, తన సూక్ష్మ కళా ప్రతిభతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. హనుమాన్ జయంతి సందర్భంగా రూపొందించిన ఈ ప్రత్యేక కళాఖండం భక్తి, సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ అద్భుత కళాఖండాన్ని చూసిన స్థానికులు, కళాభిమానులు, యువ కళాకారులు విజయ మోహన్ ప్రతిభను ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేసారు.