చేపల కోసం వల వేశాడు.. ఇది వచ్చింది..! చూసేందుకు ఊరు ఊరే క్యూ కట్టింది..?

చేపల కోసం వల వేశాడు.. ఇది వచ్చింది..! చూసేందుకు ఊరు ఊరే క్యూ కట్టింది..?


సాధారణంగా చేపలకు రెండు కళ్లు ఉంటాయి. కానీ ఈ చేపకు నాలుగు కళ్లు ఉండటం విశేషం. దీని తల భాగం ఇతర చేపల కంటే భిన్నంగా, కొంచెం వెడల్పుగా ఉంది. మోతీహరిలోని సుగౌలీ ప్రాంతంలో జాలర్లు వేటకి వెళ్లినప్పుడు ఈ చేప వారి వలలో పడింది. దీని వింత ఆకారాన్ని చూసి వారు మొదట భయపడినప్పటికీ, తర్వాత దానిని చూడటానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ వింత చేపకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనిని చూసిన నెటిజన్లు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా వందలాది చెరువులలో చేపలు పడుతున్న జాలరి రాంభరోస్ సాహ్ని, తన సుదీర్ఘ అనుభవంలో ఇంత అద్భుతమైన చేపను చూడటం ఇదే మొదటిసారి అని అన్నారు. ఇలా నాలుగు కళ్లు ఉన్న చేపను నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.. ఇది నిజంగా మాయాజాలం, అద్వితీయమైనది అని అన్నారు. ఈ వార్త తెలియగానే చెరువు వద్దకు భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన చేపను తమ కెమెరాలలో బంధించడానికి ఆత్రుతగా కనిపించారు. ప్రస్తుతం, ఈ చేప వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ప్రజలు దీనిని ప్రకృతిలోని అద్బుతంగా పరిగణిస్తున్నారు. శాస్త్రీయ దృక్కోణం నుండి చూస్తే, కొన్నిసార్లు జన్యుపరమైన మార్పుల కారణంగా జీవుల నిర్మాణం అరుదైన వర్గంలోకి వచ్చే విధంగా మారుతుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీనిని ఫోర్-ఐడ్ ఫిష్ (Four-eyed fish) లేదా అనాబ్లెప్స్ (Anableps) అని పిలుస్తారు. నిజానికి వీటికి రెండు కళ్లే ఉంటాయి. కానీ, ప్రతి కన్ను రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది. దీనివల్ల ఇవి నీటి పైన, నీటి లోపల ఒకే సమయంలో చూడగలవు. సాధారణంగా ఇవి దక్షిణ అమెరికా, మధ్య అమెరికా ప్రాంతాల్లో కనిపిస్తాయి. అయితే, బీహార్ వంటి ప్రాంతాల్లో ఇవి కనిపించడం చాలా అరుదు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి అరుదైన జీవులు బయటపడటం పర్యావరణ మార్పుల వల్ల లేదా వలసల వల్ల జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ చేప స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *