Headlines

చేదు లేకుండా ఇలా వండితే.. కాకరకాయ ఇష్టం లేనోళ్లకి కుడా ఫేవరెట్ కర్రీ అవ్వాల్సిందే.!

చేదు లేకుండా ఇలా వండితే.. కాకరకాయ ఇష్టం లేనోళ్లకి కుడా ఫేవరెట్ కర్రీ అవ్వాల్సిందే.!


కాకరకాయ అంటేనే మనలో చాలామందికి మొదట గుర్తొచ్చేది దాని చేదు. ఆ చేదు భయంతోనే పిల్లల నుండి పెద్దల వరకు చాలా మంది ఈ అద్భుతమైన కూరగాయను పక్కన పెట్టేస్తుంటారు. కానీ, నిజానికి కాకరకాయలో ఉన్నన్ని ఆరోగ్య ప్రయోజనాలు మరే ఇతర కూరగాయల్లో ఉండవు. మరి, ఆ చేదు లేకుండా, మసాలాలు వాడకుండా, ఎంతో కమ్మగా కాకరకాయ పులుసు ఎలా వండుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ఈ పద్ధతిలో వండితే కాకరకాయ ఇష్టం లేని వారు కూడా ఇష్టంగా తింటారు. చాలా మంది కాకరకాయ పైన ఉండే చెక్కును తీసేస్తుంటారు. కానీ అందులోనే అసలైన పోషకాలు ఉంటాయి. చెక్కు తీయకుండానే కూర రుచిగా ఉండాలంటే, ముందుగా ముక్కలను నూనెలో బాగా వేయించడం పర్ఫెక్ట్ ఆప్షన్. దీనివల్ల చేదు తగ్గుతుంది.

కావాల్సిన పదార్థాలు:

అర కేజీ ఉల్లిపాయలు (ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటే కూర అంత తీపిగా, రుచిగా ఉంటుంది), పావు కేజీ కాకరకాయలు, చింతపండు రసం, బెల్లం ముక్క, సాధారణ పోపు దినుసులు.

మొదట బాణలిలో తగినంత నూనె పోసి కాకరకాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. ముక్కల్లోని పచ్చిదనం పోయి కొంచెం రంగు మారాక వాటిని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. ఈ పోపులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. కూర రుచి అంతా ఈ ఉల్లిపాయలు వేయించడంలోనే ఉంటుంది. ఉల్లిపాయలు మగ్గాక, వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, పసుపు, కారం, సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.

ముక్కలు ఉడకడానికి కొన్ని నీళ్లు పోసి ఐదు నిమిషాలు మూత పెట్టాలి. ముక్క మెత్తబడ్డాక చింతపండు రసం, కొంచెం బెల్లం ముక్క చేర్చాలి. పులుపు, తీపి, కారం సమపాళ్లలో ఉంటేనే ఈ పులుసుకి నిండుదనం వస్తుంది. నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మసాలాలు లేకుండా కేవలం ఉల్లిపాయలు, చింతపండుతో చేసే ఈ పులుసు వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే స్వర్గమే!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *