క్యాస్ట్ కారణంగా నన్ను సినిమాల్లో తీసుకోలేదు.. షాకింగ్ విషయం చెప్పిన మహేష్ విట్టా

క్యాస్ట్ కారణంగా నన్ను సినిమాల్లో తీసుకోలేదు.. షాకింగ్ విషయం చెప్పిన మహేష్ విట్టా


మహేష్ విట్టా తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించి మెప్పించాడు. ప్రస్తతం సినిమాలు తగ్గించాడు మహేష్.. సినిమాలతో పాటు జబర్దస్త్ లోనూ నవ్వులు పూయించాడు మహేష్. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన తన సినీ ప్రయాణం, చిత్ర నిర్మాణ సవాళ్లు, వ్యక్తిగత జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనను తాను ఒక నిజాయితీపరుడిగా అభివర్ణించుకుంటూ.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమైనప్పటికీ తనదైన శైలిలో ముందుకెళ్తున్నానని తెలిపారు. మహేష్ విట్టా తొలుత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పరిశ్రమలోకి ప్రవేశించాలనుకున్నారు.

ఇది కూడా చదవండి : Folk Song: ఎంతో అదృష్టం చేసుకుంటే నాకు ఆ పాట వచ్చింది.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్

2016లో దర్శకుడు తేజ ఆఫీస్‌కు వెళ్లగా, ఆయన డైరెక్షన్ కంటే నటనపై దృష్టి పెట్టమని, నటుడిగా డబ్బు సంపాదించడం సులభమని సలహా ఇచ్చారు. తేజ సలహా మేరకు నటనలో కొనసాగాడు మహేష్, లాక్‌డౌన్ సమయంలో తన స్నేహితులను కోల్పోవడం వల్ల ఒక ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించి, తన స్నేహితులకు అవకాశాలు కల్పించాలనే ఆలోచన వచ్చిందని మహేష్ తెలిపారు. సుహాస్, కిరణ్ అబ్బవరం వంటి యూట్యూబ్ మిత్రుల విజయాలు కూడా తనకు ప్రేరణనిచ్చాయని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! సూర్య ఎత్తుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..

డబ్బులు అవసరం అనే పరిస్థితిలో సెలెక్టివిటీ లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించాల్సి వచ్చిందని, కొన్ని సందర్భాల్లో డిమాండ్ తగ్గించడం వల్ల తన పారితోషికాలను కూడా ఎగ్గొట్టారని తెలిపాడు మహేష్. తన క్యాస్ట్ కారణంగా తనకు చాలా అవకాశాలు పోయాయి అని తెలిపారు. క్యారెక్టర్ ఇవ్వడం, డేట్స్ ఫిక్స్ చేయడం చివరి నిమిషంలో ఆ క్యారెక్టర్ వేరే వాళ్లకు ఇవ్వడం చేశారు. అప్పుడు నాకు ఎందుకు తీసుకోలేదు తెలిసేది కాదు. ఆ తర్వాత నాలాగే ఎవరికైనా జరిగినప్పుడు.. నేను నాకు ఇలాగే జరిగిందన్నా అని వాళ్లకు చెప్పినప్పుడు.  క్యాస్ట్ కారణంగానే తీసుకోలేదని అప్పుడు నాకు తెలిసిందని  మహేష్ విట్టా తెలిపారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నా భర్తకు తొమ్మిది మందితో ఎఫైర్.. మొత్తం బయటపెట్టిన సీరియల్ నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *