సహజ పానీయాలు మన రోజువారీ ఆరోగ్యానికి ఎంతో తోడ్పడతాయి. వీటిలో కొబ్బరి నీరు, దానిమ్మ రసం రెండింటికీ ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కేలరీలు, పోషకాలు, శరీరంపై చూపే ప్రభావం పరంగా వీటి మధ్య తేడాలు ఉన్నాయి. మీ ఆరోగ్య లక్ష్యాన్ని బట్టి ఏది ఎంచుకుంటే మంచిదో పరిశీలిద్దాం.
కొబ్బరి నీరు వల్ల కలిగే ప్రయోజనాలు
కొబ్బరి నీళ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఒక గ్లాసు కొబ్బరి నీళ్లలో సుమారు 60 కేలరీల శక్తి లభిస్తుందని పేర్కొంటారు. పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉండి శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ను సమతుల్యం చేస్తాయి.
హైడ్రేషన్, వ్యాయామం తర్వాత: చెమట ద్వారా కోల్పోయిన ఖనిజాలను తిరిగి పొందడానికి కొబ్బరి నీరు అనుకూలంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి
బరువు నియంత్రణ: తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.
జీర్ణ ఆరోగ్యం, కిడ్నీ మద్దతు: కడుపులో మంట, శరీర వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. సహజ డైయూరెటిక్ గుణాల వల్ల కిడ్నీ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
దానిమ్మ రసం వల్ల కలిగే ప్రయోజనాలు
దానిమ్మ రసంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఒక గ్లాసు దానిమ్మ రసంలో సుమారు 130 కేలరీల శక్తి లభిస్తుంది.
గుండె, రోగనిరోధక శక్తి: ఇందులోని యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, విటమిన్ సి, ఇ, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇమ్యూనిటీని పెంచడానికి దోహదపడతాయి.
ఐరన్ మద్దతు: దానిమ్మలో ఐరన్, విటమిన్ సి ఉండటంతో రక్తహీనతతో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది.
ఏది ఎంచుకోవాలి?
తక్కువ కేలరీలతో హైడ్రేషన్, వ్యాయామం అనంతర రికవరీ, చలవ కోసం కొబ్బరి నీరు ఉత్తమం. గుండె ఆరోగ్యం, ఇమ్యూనిటీ, ఐరన్ అవసరాలకు దానిమ్మ రసం మేలు చేస్తుంది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ఆహార నియమాలపై వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..