Headlines

కొబ్బరికాయకు మూడు కళ్లు ఎందుకు ఉంటాయి? లోపలికి నీరు ఎలా చేరుతుందో తెలుసా?


కొబ్బరికాయకు మూడు కళ్లు ఎందుకు ఉంటాయి? లోపలికి నీరు ఎలా చేరుతుందో తెలుసా?

వంటకాలలో, పూజా కార్యక్రమాల్లో కొబ్బరికాయను విస్తృతంగా ఉపయోగిస్తాం. నీరు ఉండే కొబ్బరికాయలపై మూడు వలయాలుగా కనిపించే నల్లని మచ్చలను చాలామంది చూసే ఉంటారు. వాటిని సాధారణ భాషలో కొబ్బరి కళ్లు అంటారు. వర్షపు నీరు లేదా చెట్టు నీరు ఈ మూడు మచ్చల ద్వారా కొబ్బరికాయ లోపలికి చేరుతుందనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. అయితే శాస్త్రీయంగా దీని వెనుక ఆసక్తికరమైన ప్రక్రియ దాగి ఉంది.

మూడు కళ్లు ఎందుకు ఏర్పడతాయి?

కొబ్బరి చెట్టుపై కాయ అభివృద్ధి చెందే ప్రారంభ దశలోనే ఈ గుర్తులు ఏర్పడతాయి. ముందుగా చెట్టుకు పూత వచ్చి, ఆ తర్వాతి ప్రక్రియలో మూడు చిన్న విత్తనాలు లేదా అండాలు రూపుదిద్దుకుంటాయి. కొబ్బరికాయ పరిమాణం పెరిగి పరిపక్వమవుతున్న కొద్దీ, ఆ మూడింటిలో ఒక విత్తనం మాత్రమే పూర్తిగా ఎదిగి, మిగిలిన రెండు అభివృద్ధి చెందకుండా ఆగిపోతాయి. బయటి పెంకుపై కనిపించే ఆ మూడు గుండ్రని మచ్చలే వీటి తాలూకు గుర్తులు.

చూడటానికి మూడు మచ్చలు ఒకేలా కనిపించినప్పటికీ, వాటిలో ఒకటి సహజంగానే కొంత మృదువుగా ఉండి సులభంగా రంధ్రం చేయడానికి అనువుగా ఉంటుంది. కొబ్బరికాయ పగలగొట్టేటప్పుడు లేదా నీరు తీసేటప్పుడు సాధారణంగా ఈ మృదువైన భాగాన్నే ఎంచుకుంటారు.

కొబ్బరి నీరు ఎలా తయారవుతుంది?

కొబ్బరికాయలోని పోషకాలతో కూడిన నీరు ఈ మూడు మచ్చల గుండా లోపలికి రాదు. కొబ్బరి చెట్టు తన దృఢమైన వేర్ల ద్వారా భూగర్భ జలాలు, అవసరమైన ఖనిజాలను గ్రహిస్తుంది. ఆ ద్రవాలు చెట్టులోని వాస్కులర్ వ్యవస్థ ద్వారా నేరుగా కాయ లోపలికి చేరుతాయి. శాస్త్రీయ పరిభాషలో ఈ ప్రారంభ ద్రవాన్ని లిక్విడ్ ఎండోస్పెర్మ్ అని పిలుస్తారు. కొబ్బరికాయ ముదిరే కొద్దీ ఈ ద్రవమే క్రమంగా చిక్కబడి, కొబ్బరి కండగా మారుతుంది. ఈ విధంగా ప్రకృతిసిద్ధంగా కొబ్బరికాయలో నీరు చేరి, ఆ తర్వాత కొబ్బరిగా రూపాంతరం చెందుతుంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *