Headlines

కోటి రూపాయలు పెట్టి సినిమా చేశా.. కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది! దెబ్బకు మళ్లీ ఆ సైడ్ వెళ్ళలేదు


కోటి రూపాయలు పెట్టి సినిమా చేశా.. కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది! దెబ్బకు మళ్లీ ఆ సైడ్ వెళ్ళలేదు

తన కెరీర్ తొలినాళ్లలో శ్రీరాములయ్య షూటింగ్ సమయంలో అనంతపురం నుండి రైలు ఎక్కిన ఒక సంఘటనను ఎం.ఎస్. నారాయణ గుర్తుచేసుకున్నారు. బేగంపేటలో రైలు ఎక్కితే, సికింద్రాబాద్ నుంచి టికెట్ తెస్తానని చెప్పిన మేనేజర్ మర్చిపోవడంతో, రైలులో టికెట్ లేకుండా ప్రయాణించాల్సి వచ్చిందని తెలిపారు. “సెకండ్ ఏసీలో కూర్చుంటే టీటీఈ గారు శంకర్ రావు వచ్చారు. టికెట్ అడిగారు. మేనేజర్ తెస్తానన్నాడు, సికింద్రాబాద్ లో తిరుగుతున్నాడండి అని చెప్పాను. అయ్యయ్యో కూర్చోండి మీరు” అంటూ శంకర్ పల్లిలో రైలు ఆగగానే, ఆయన స్వయంగా స్టేషన్‌కు వెళ్లి జనరల్ టికెట్ కొని ఏసీ పేరు రాసి జేబులో పెట్టి టెన్షన్ పడొద్దని చెప్పిన సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమేనని, ఇలాంటి మంచితనమే తనను ఎన్నోసార్లు ఆదుకుందని వివరించారు.

పట్టింపులు లేని తన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతూ, తనకు గ్రామాల్లో, గుడిసెల్లో వండుకునే పులుసు, కూరలు వంటి సాదాసీదా వంటకాలంటే చాలా ఇష్టమని తెలిపారు. చిన్నప్పుడు తన తల్లి వండిన రుచిని ఈ వంటకాలలో వెతుకుతానని పేర్కొన్నారు. ఒకసారి ఏవీఎస్ గారితో కలిసి అడవిలో షూటింగ్ సమయంలో, కోయవారు వండుతున్న కందిపప్పుచారు వాసన ఆకలిని రేకెత్తించిందని వివరించారు. మెస్ నుంచి వచ్చే భోజనం కంటే, వారు పండించుకుని, వండుకునే సహజమైన పప్పుచారు చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. ఏవీఎస్ గారు పట్టింపులతో తినకపోయినా, తాను మాత్రం అడిగి మరీ పప్పుచారుతో భోజనం చేసినట్లు చెప్పారు. తన కులాంతర వివాహం గురించి కూడా ఆయన పంచుకున్నారు. తన భార్య బ్రాహ్మణులని, తాను కాపు అని తెలిపారు. అయితే, తన ఇంటిపేరు మైలవరపు బ్రాహ్మణులలో ఎక్కువగా ఉండటం, తాను సంస్కృతం చదువుకోవడం వల్ల చాలామంది తనను బ్రాహ్మణుడిగా భావించేవారని తెలిపారు. అలాంటి సందర్భాలలో అభిమానించేవారి మనసు గాయపడకుండా, తాను బ్రాహ్మణుడు కాదని చెప్పడానికి కొంత ఇబ్బంది పడ్డానని పేర్కొన్నారు.

తన కుమారుడి సినీ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ, ఆయనను దర్శకుడిగా పరిచయం చేయడానికి ప్రయత్నించానని చెప్పారు. కొందరు కో-డైరెక్టర్లను అడిగితే నమ్మకం లేదని చెప్పారన్నారు. తన కుమారుడి ప్రతిభపై నమ్మకంతో, స్వయంగా కోటి రూపాయలు ఖర్చు చేసి సినిమా తీశానని, కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది అనుకున్నంత విజయం సాధించలేదని వివరించారు. అయితే, ఆ తర్వాత తను నటనపైనే దృష్టి సారించి, కుమారుడు నటుడిగా ఎదిగేందుకు తన మార్గాన్ని తానై ఎంచుకుంటాడని నమ్మినట్లు చెప్పారు. ప్రస్తుతం తన కుమారుడు క్యారెక్టర్ పాత్రలు చేస్తున్నాడని, అతను నటుడు అయితే, అతని ప్రతిభే అతన్ని ముందుకు తీసుకెళ్తుందని నారాయణ గారు దృఢంగా నమ్మారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *