Headlines

కాలువలో 23 కేజీల భారీ చేప.. లారీ డ్రైవర్ చేసిన పనికి అంతా షాక్! కట్ చేస్తే, 10 మందికి పంచాడు..


ఏలూరు : తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు పశ్చిమగోదావరి జిల్లాలో వింత అనుభవాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, డ్రైన్లలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. ఈ వరద ప్రవాహంలోనే పెద్ద పెద్ద చేపలు కొట్టుకొస్తుండటంతో స్థానికులు వాటిని పట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. భీమవరం పరిధిలోని యనమదుర్రు డ్రైన్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరి దిగువకు వేగంగా ప్రవహిస్తోంది. ఈ నీటితో పాటే భారీ పరిమాణంలో చేపలు తేలుతూ వస్తున్నాయి. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు, ఉండి మండలం యండగండితో పాటు భీమవరం పరిసర ప్రాంతాల్లోని డ్రైన్ల వద్ద చేపలను పట్టుకోవడానికి స్థానికులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

దూకి పట్టుకున్న లారీ డ్రైవర్.. పది మందికి పంపకం

పాలకోడేరు మండలం గొల్లలకోడేరు వద్ద యనమదుర్రు డ్రైన్‌లో సుమారు 23 కేజీల బరువున్న ఓ భారీ చేప కొట్టుకురావడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ నీటిలో తేలుతున్న ఆ భారీ చేపను గమనించి, వెంటనే డ్రైన్‌లోకి దిగి చాకచక్యంగా ఒడ్డుకు చేర్చాడు. అంత పెద్ద చేపను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అనంతరం పది మంది కలిసి ఆ చేపను వాటాలు వేసుకుని పంచుకున్నారు.

గత రెండు రోజులుగా యనమదుర్రు డ్రైన్‌లో పెద్ద ఎత్తున చేపలు లభ్యమవుతుండటంతో, వలలు, గాలాలతో స్థానికులు కాలువల గట్ల వెంబడి చేరి చేపల వేట కొనసాగిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *