Headlines

కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్లు


ఒకప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేసిన ఈ క్రేజీ హీరోయిన్లకు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర అసలేమైంది..? బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో డైలమాలో పడిపోయిన ఈ బ్యూటీలు మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందా..? కమర్షియల్ సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఈ గ్లామర్ భామల ఫేట్ మారేదెప్పుడో..? అసలు ఈ లిస్టులో ఉన్న హీరోయిన్స్ ఎవరో చూద్దామా..? ఇండస్ట్రీని కొన్నాళ్ల పాటు ఉర్రూతలూగించిన శ్రీలీలకు మూడేళ్లుగా సరైన హిట్ లేకపోవడంతో ప్రస్తుతం తెలుగులో సినిమాలు కూడా అసలు చేయట్లేదు. మరోవైపు ఉప్పెనలా వచ్చిన కృతి శెట్టికి ఇప్పుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న జనవరి 12 విడుదల లాస్ట్ హోప్ అని చెప్పాలి. ఇందులో కళ్యాణ్ రామ్‌కు జోడీగా నటిస్తున్న ఈ బేబమ్మకు హిట్ రావడం చాలా కీలకమిప్పుడు. రాజా సాబ్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్ ట్రాక్ రికార్డ్ ఏమంత బాలేదు. తాజాగా సర్దార్ 2తో వచ్చినా ఇది కూడా డిజాస్టరే. ‘అమిగోస్’ సినిమాతో పరిచయమై నా సామిరంగతో పర్లేదనిపించిన అషికా రంగనాథ్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే తయారైంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి, లేటెస్ట్‌గా వచ్చిన సర్దార్ 2 కూడా ఫ్లాప్ అవ్వడంతో ఈ బ్యూటీ కెరీర్ డైలమాలో పడింది. ఒకప్పుడు టాలీవుడ్‌లో బుట్టబొమ్మగా విజయాలందుకున్న పూజా హెగ్డేకు కూడా కొన్నేళ్లుగా అసలు హిట్టే లేదు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న శ్రీ శ్రీపైనే ఈ అమ్మడు ఆశలన్నీ ఉన్నాయి. సాలిడ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న ఈ హీరోయిన్స్ అందరూ తమ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌తో అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కుతారో లేదో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుడ్డోడిని పట్టించుకోరా? సెలక్టర్ల పై కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్

వయసు దాటిన ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌..ఇక.. 44 ఏళ్లొచ్చినా సర్కార్‌ నౌకరీకి అర్హులే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *