Headlines

కట్నంగా ‘థార్’ అడిగిన వరుడి కుటుంబం.. దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన వధువు తండ్రి !!


పెళ్లి అనే వేడుక ఇద్దరు మనుషులనే కాదు.. రెండు కుటుంబాలను కూడా ఒకటి చేస్తోంది. అందుకే ఈ బృహత్తర వేడుక కోసం అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి.. అన్నీ నిశ్చయించుకునే వివాహం చేసుకోవాలని పెద్దలు సూచిస్తుంటారు. అంతే కాకుండా జీవితంలో ఎంతో మధురమైన ఈ తంతుని ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలనుకునే అనుకుంటారు. మరీ ముఖ్యంగా వరకట్నం పేరుతో అమ్మాయిల కుటుంబాలపై విపరీతమైన ఆర్థిక భారం పడుతుంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ మాత్రం కొంచెం అటు ఇటుగా ఇలానే అనిపించినా అమ్మాయి తండ్రి చేసిన పని మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పెళ్లి తేదీ ఖరారు చేయడానికి వచ్చిన అబ్బాయి కుటుంబం.. కట్నంగా ‘థార్’ (Thar) కారు కావాలంటూ పట్టుబట్టింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో అమ్మాయి తరపు వారు తమ ఆర్ధిక స్థోమత, ఇష్టాన్ని బట్టి నిర్ణయాలను చెబుతూ ఉంటారు. ఇక అందుకు కష్టంగా భావించే వారు మాట్లాడి లేదా బతిమిలాడటం చేస్తూ ఉంటారు. ఇక తప్పదు అనుకున్న కొందరు మాత్రం భయపడి అప్పులు చేసి మరీ అబ్బాయి తరపు వారి కోరిక తీరుస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం సదరు అమ్మాయి తండ్రి అలా చేయకుండా వరుడు కుటుంబానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.

కాగా అప్పటికే పలుమార్లు రెండు కుటుంబాల మధ్య ఇదే విషయంలో చర్చలు జరిగినట్టు సమాచారం. తమకు అంత ఆర్ధిక స్థోమత లేదు అంటూ విన్నవించుకున్నట్టు అమ్మాయి తరపు బంధువులు వాపోతున్నారు. అయినా కానీ వరుడి కుటుంబం ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన ఆ తండ్రి ఇంటి లోపలికి వెళ్లి ఒక చిన్న బాక్స్‌తో బయటకు వచ్చాడు. నేరుగా వరుడి తండ్రి చేతిలో ఆ బాక్స్‌ను పెట్టి, “మీకు మనిషి కాదు, కారు కావాలి కదా! ఇదిగో మీరు కోరుకున్న ‘థార్’ కారు..” అంటూ దానిని తెరిచాడు. ఈ ఊహించని ఘటనతో అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు. అంతే కాకుండా పెళ్లిని కూడా రద్దు చేసుకుంటున్నామని ప్రకటించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. కట్నం కోసం వేధించే వారికి ప్రతి తండ్రి ఇలాగే బదులు చెప్పాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గమనించాల్సిన విషయాలు..

మన దేశంలో వరకట్న నిషేధ చట్టం మరియు ఐపీసీ సెక్షన్ 498A ప్రకారం కట్నం అడగడం, వేధించడం చట్టరీత్యా నేరం. దీనిపై కఠిన శిక్షలు కూడా ఉన్నాయి. ఇప్పటికే వరకట్నం పేరుతో వేధింపులను తట్టుకోలేక ఎంతోమంది యువతులు బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. పెళ్లయిన తర్వాత కూడా అదనపు కట్నం కోసం కోడళ్లను శారీరకంగా, మానసికంగా వేధించడం, గృహహింసకు పాల్పడటం వంటి అరాచకాలు నిత్యం జరుగుతూనే ఉంటున్నాయి. అందుకే ఈ తరహా ఘటనలకు స్వస్తి పలికేందుకు ఈ ఘటనలో తండ్రి చూపించిన తెగువను ప్రతి ఒక్కరూ ప్రదర్శించాలని కోరుతున్నారు.

వైరల్ వీడియో..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *