నాగ దుర్గ చిన్నతనం నుండి ప్రభాస్ అభిమానుల ఈవెంట్స్ లో, ప్రోగ్రామ్స్ చురుకుగా పాల్గొనేదాన్ని.. ఫ్యాన్స్ నాకు ప్రభాస్ టీ-షర్ట్‌లు, కార్డులు, పెద్ద పోస్టర్‌లు ఇచ్చేవారు అని తెలిపింది. అంతే కాదు స్కూల్ లో ఉన్నప్పుడు తన స్నేహితులకు ప్రభాస్ ఫోటోలను, గ్రీటింగ్ కార్డులను పంచేదాన్ని అని తెలిపింది. ఎనిమిది, తొమ్మిది చదివేవరకు నల్గొండలోని ఆమె గది మొత్తం ప్రభాస్ పోస్టర్‌లతో నిండి ఉండేదని తెలిపింది.