ఏనుగుకి కోపం వస్తే..రచ్చ రంబోలే.. వీడియో చూస్తే వణకాల్సిందే!

ఏనుగుకి కోపం వస్తే..రచ్చ రంబోలే.. వీడియో చూస్తే వణకాల్సిందే!


కేరళలో ఏనుగు కారుపై దాడి చేసి ధ్వంసం చేసింది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం క్షణాల్లో భీతావహంగా మారింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న తెల్లటి కారుపై ఆగ్రహించిన ఓ ఏనుగు దాడికి దిగింది. తన బలమైన తొండం, దంతాలతో కారును ప్లాస్టిక్ బొమ్మలా గాలిలోకి విసిరేసి, పూర్తిగా నుజ్జునుజ్జు చేసింది. ఈ ఘటన జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. అదృష్టవశాత్తు, దాడి జరిగిన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ ప్రయాణికులు ఉండి ఉంటే పరిస్థితి మరింత భయంకరంగా ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, నెటిజన్లు ఏనుగు ఆగ్రహాన్ని చూసి షాక్ అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

వైరల్ అవుతున్న సారా అర్జున్‌ లేటెస్ట్ ఫోటో షూట్

టాలీవుడ్‌ లో మళ్లీ మొదలైన థియేటర్ల వివాదం

ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా దేవర సీక్వెల్

ముంచేస్తున్న ఫ్లాప్స్.. రావట్లేదు ఆఫర్స్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *