Headlines

ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా.. ఇది మీకోసమే


ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే కారును ఇంటి వద్ద ప్లగ్ ఇన్ చేసే ముందు మీ ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ విద్యుత్ లోడ్‌ను తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. సొంత ఇళ్లలో నివసించేవారికి EV ఛార్జర్‌ను అమర్చుకోవడం కొంత సులభమైనప్పటికీ, అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కేవలం ఛార్జర్ కొనుగోలు చేయడం ఒక్కటే కాకుండా, ఆ భవనంలోని వైరింగ్, ట్రాన్స్‌ఫార్మర్ మరియు హౌసింగ్ సొసైటీ, ఈ అదనపు విద్యుత్ భారాన్ని మోయగలవా లేదా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. సాధారణంగా చాలా ఇళ్లలో 3 నుంచి 4 కిలోవాట్ల ఆమోదిత లోడ్ మాత్రమే ఉంటుంది. కానీ ఒక సాధారణ EV ఛార్జర్, కారు అవసరాలను బట్టి అదనంగా మరో 7.5 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ లోడ్‌ను జోడిస్తుంది. వేగవంతమైన ఫాస్ట్ ఛార్జర్లకు అయితే ఏకంగా 22 కిలోవాట్ల వరకు విద్యుత్ అవసరం కావచ్చు. రాత్రివేళల్లో హౌసింగ్ సొసైటీలలో డజన్ల కొద్దీ కార్లు ఒకేసారి ఛార్జింగ్ పెడితే, లిఫ్టులు, ఏసీలు, పంపుల వంటి సాధారణ అవసరాల కోసం రూపొందించిన ట్రాన్స్‌ఫార్మర్లపై తీవ్రమైన భారం పడుతుంది. దీనివల్ల వైరింగ్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు అదనపు వైరింగ్, లోడ్ అప్‌గ్రేడ్‌లు, ప్రత్యేక మీటర్లు, సొసైటీ అనుమతులతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్యల నుంచి బయటపడటానికి కారు కొనుగోలు చేసే ముందే కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. కారు బుక్ చేయడానికి ముందే మీ ఫ్లాట్‌కు మంజూరైన లోడ్ ఎంత ఉందో చెక్‌ చేసుకొని, ఛార్జర్‌కు కావలసిన అదనపు సామర్థ్యాన్ని లెక్కించాలి. అలాగే, మీ పొరుగువారు ఛార్జర్‌ను ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన, అందరూ అలాగే చేయవచ్చని భావించవద్దు. అదనపు EV లోడ్‌ల కోసం భవనంలో తగినంత అదనపు సామర్థ్యం ఉందో లేదో RWA లేదా ఫెసిలిటీ మేనేజర్‌ను అడిగి భవన సామర్థ్యాన్ని నిర్ధారించుకోవాలి. మీ పార్కింగ్ స్థలానికి ప్రత్యేక మీటర్ లేదా సర్క్యూట్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉందో లేదో పరిశీలించాలి. వాహనం కొనే ముందే స్థానిక డిస్కామ్, RWA మరియు సొసైటీ అధికారులతో మాట్లాడి నిబంధనలను తెలుసుకోవాలి. ఛార్జర్‌ను కేవలం సాధారణ ఉపకరణంగా చూడకుండా, ప్రత్యేక వైరింగ్, తగిన MCB, RCCB రక్షణతో అర్హత గల నిపుణుడి చేత మాత్రమే ఇన్‌స్టాల్‌ చేయించుకోవాలి. తాత్కాలిక ఎక్స్‌టెన్షన్ కేబుల్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదు. ఈ సమస్యలకు మరో చక్కని పరిష్కారమే ‘స్మార్ట్ ఛార్జింగ్’. ప్రతి ఒక్కరూ ఒకే సమయంలో గరిష్ట శక్తిని వినియోగించుకోకుండా, అందుబాటులో ఉన్న విద్యుత్‌ను బట్టి విడతలవారీగా ఛార్జ్ అయ్యేలా దీనిని నిర్వహించవచ్చు. క్రమమైన లోడ్ తనిఖీలు, సరైన కేబుల్స్, స్మార్ట్ ఛార్జింగ్ పద్ధతులు పాటిస్తే భవిష్యత్తులో ఎలాంటి విద్యుత్ అంతరాయాలు లేకుండా హాయిగా ఈవీలను వాడవచ్చు. ఒకవేళ ఇళ్ల వద్ద ఇన్‌స్టాలేషన్ సాధ్యం కాని వారు మొబైల్ ఛార్జింగ్ సేవలను ఆశ్రయించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం..

అదుపు తప్పి బావి వైపు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. 54 మంది ప్రయాణికులు…!

ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!

ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు

మా దుస్థితికి బాధ్యులు మీరే.. ఆ.. దేశాలపై నేపాల్‌ ఫైర్ !



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *