Headlines

ఎన్డీఏ Vs ఇండియా కూటమి: వాడివేడిగా పార్లమెంట్‌ సమావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం..

ఎన్డీఏ Vs ఇండియా కూటమి: వాడివేడిగా పార్లమెంట్‌ సమావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం..


పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఊహించినట్టే వాడివేడిగా కొనసాగుతున్నాయి. నీట్‌ పేపర్‌ లీక్‌తో పాటు అయోధ్య రామమందిరం విరాళాల చోరీ, ఇథనాల్‌లో పెట్రోలు మిక్సింగ్‌ వ్యవహారంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి.. ఈ క్రమంలోనే.. మంగళవారం రెండో రోజు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా.. పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానాలు ఇచ్చారు. విద్యార్థులపై పోలీసుల దాడిపై వాయిదా తీర్మానం ఇచ్చారు ఎంపీ మాణిక్కం ఠాగూర్.. పార్టీ ఫిరాయింపులపై నూతన చట్టం తీసుకురావాలని.. వాయిదా తీర్మానం ఇచ్చారు ఎంపీ మనీష్ తివారీ.. నిరసన తెలుపుతున్న విద్యార్థులతో ప్రభుత్వం చర్చించాలన్ని సూచించారు కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ.
ఈ మేరకు.. లోక్‌సభ స్పీకర్‌ను విపక్ష నేతలు కలిశారు. విద్యార్థుల ఆందోళనపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి..

ఎన్డీఏ పార్లమెంటరీ భేటీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీక్ పై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పార్లమెంట్‌ సమావేశాలపై మోదీ మార్గనిర్దేశం చేశారని.. రైతుల సంక్షేమానికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని కిరణ్‌ రిజిజు తెలిపారు. నీట్‌ పేపర్‌ లీక్‌పై కేంద్రం వేగంగా స్పందించిందని..13 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపాం.. పేపర్‌ లీక్‌కు పాల్పడినవారికి కఠినశిక్ష పడాల్సిందే అంటూ తెలిపారు. పేపర్‌ లీక్‌ వ్యవహారం రాజకీయాలకు అతీతమని..సిస్టమ్‌ను ఫుల్‌ప్రూఫ్‌గా మార్చుతున్నామని రిజిజు స్పష్టంచేశారు.

వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్న కీలక బిల్లులు

ఆదాయపు పన్ను (సవరణ) బిల్లు, 2026, సుప్రీం కోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు.. అలాగే.. జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు, 2026: జాతీయ గీతం వందేమాతరంకు ఆటంకం కలిగించడం లేదా అవమానించడాన్ని నేరంగా పరిగణించే బిల్లు.. దీంతోపాటు.. సూక్ష్మ, చిన్న – మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు, జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు, 2026: పౌర నమోదు వ్యవస్థను ఆధునికీకరించి, క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *