Headlines

ఎత్తు 2 అడుగులే.. విలువ రూ.1 కోటి పైన..? పుష్కర్ మేళాలో సందడి చేసిన పొట్టి గేదె పింకీ!


రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో జరిగిన పుష్కర్ పశువుల మేళా 2026 నవంబర్ 24తో ముగిసినప్పటికీ, ఆ మేళాలో కనిపించిన ఒక ప్రత్యేక జంతువు గురించి సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. సాధారణంగా ఇలాంటి మేళాల్లో భారీకాయం కలిగిన పశువులు ఎక్కువగా సందడి చేస్తుంటాయి. కానీ ఈసారి కేవలం 2 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న పింకీ అనే చిన్న గేదె ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ప్రత్యేకత ఏమిటి?

సాధారణ గేదెలతో పోలిస్తే పింకీ ఆకారం చాలా చిన్నదిగా ఉండటంతో దీనిని ప్రపంచంలోనే అత్యంత పొట్టి గేదెగా అభివర్ణిస్తున్నారు. మేళాకు వచ్చిన చిన్నారుల నుంచి స్వదేశీ, విదేశీ పర్యాటకుల వరకు అందరూ దీనిని ఆసక్తిగా తిలకించారు. పింకీని చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా, దానితో ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి సందర్శకులు పోటీ పడ్డారు.

ఇవి కూడా చదవండి



యజమాని చెప్పిన వివరాలివే:

పింకీ యజమాని అయిన సోహిల్, థానేలో ఒక వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు. పింకీ పొట్టిగా ఉండటానికి గల కారణాన్ని వివరిస్తూ, ఇది ఏ ప్రత్యేక జాతి వల్ల కాదని, సహజంగానే అలా పెరిగిందని తెలిపారు. పింకీకి 5 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ సాధారణ గేదెల మాదిరిగా శారీరక ఎదుగుదల కనిపించలేదని చెప్పారు. దీని తల్లి కూడా సుమారు 3 అడుగుల ఎత్తు ఉండేదని, రోజుకు 2 లీటర్ల పాలు ఇచ్చేదని, అయితే పింకీ ఇంకా ఏ దూడకూ జన్మనివ్వలేదని పేర్కొన్నారు. తన వద్ద మరికొన్ని విభిన్నమైన జంతువులు ఉన్నాయని, వచ్చే ఏడాది మేళాకు వాటిని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సోహిల్ వివరించారు.

ధరపై వైరల్ కథనాలు:

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, పోస్టులలో పింకీ విలువ రూ.20 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉండవచ్చని పేర్కొంటున్నారు. అయితే దీని ధరపై యజమాని సోహిల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, తన విభిన్న రూపంతో పుష్కర్ మేళాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పింకీ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *