Headlines

ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే మీరే తోపులు.. తలలు పట్టుకుంటున్న జనాలు..


సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో రకాల వింతలు, విశేషాలు, ఆప్టికల్ ఇల్యూషన్లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. మెదడుకు పదును పెట్టే సరికొత్త పజిల్స్ కనిపిస్తే చాలు.. నెటిజన్లు క్షణాల్లో వాటిని వైరల్ చేసేస్తుంటారు. తాజాగా అలాంటిదే ఒక ఆసక్తికరమైన పజిల్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. సాధారణంగా కనిపించే ఒక ప్రశ్న.. ఎంతోమంది మేధావులను సైతం ఆలోచనలో పడేస్తూ తలలు పట్టుకునేలా చేస్తోంది.

వైరల్ అవుతున్న ఆ ప్రశ్న ఏమిటి?

ఒక భవనంపై నిలబడి ఉన్న యువతి, పక్కనే ఉన్న గోడపై రాసి ఉన్న ఒక సందేశాన్ని చూస్తున్న ఫొటో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ వేదికల్లో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఆ గోడపై తెలుగు, ఇంగ్లీష్ కలగలిపి రాసిన ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఉంది.

  • June లో ఒకసారి కనపడుతుంది.
  • November లో రెండుసార్లు కనపడుతుంది.
  • కానీ May లో కనిపించదు… ఏంటది?

ఈ ఒక్క ప్రశ్న ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకే దారితీసింది. ఫొటో చూసిన ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో సమాధానాలు వెతికే పనిలో పడిపోయారు.

రకరకాల ఊహాగానాలు.. తలలు పట్టుకుంటున్న యూజర్లు

ఈ పజిల్‌ను చూడగానే చాలామంది దీనిని వాతావరణానికి సంబంధించిన చిక్కుముడి అనుకున్నారు. జూన్‌లో మొదలయ్యే వర్షాలు, నవంబర్‌లో వచ్చే చలి తీవ్రత ఆధారంగా లెక్కలు వేస్తూ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. మరికొందరేమో నెలల వారీగా వచ్చే సెలవులు, పండుగలు లేదా క్యాలెండర్ తేదీలు, అమావాస్య-పౌర్ణమిల వంటి ఖగోళ మార్పులతో ముడిపెట్టి చూశారు. కొందరు సూర్యుడు, ఎండ, వర్షం అంటూ కామెంట్లు చేస్తుంటే.. ఇంకొందరు కచ్చితంగా ఇది సైన్స్ లేదా జీకేకు సంబంధించిన ప్రశ్న అంటూ తీవ్రంగా బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. అయితే ఈ ఆలోచనలన్నీ తప్పుదారి పట్టించేవే తప్ప అసలు లాజిక్‌ను తాకలేకపోయాయి.

అసలు లాజిక్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

ఈ పజిల్‌కు సమాధానం కోసం ప్రకృతి వైపో, క్యాలెండర్ వైపో లేదా సైన్స్ పుస్తకాల వైపో చూడాల్సిన అవసరం అస్సలు లేదు. చిన్నపిల్లల ఆలోచనతో కేవలం ఆయా నెలల ఇంగ్లీష్ పేర్ల స్పెల్లింగ్స్‌ను నిశితంగా గమనిస్తే క్షణాల్లో సమాధానం తెలిసిపోతుంది.

  • June అనే పదంలో e అనే అక్షరం ఒక్కసారి మాత్రమే వస్తుంది.
  • November అనే పదంలో e అనే అక్షరం రెండుసార్లు వస్తుంది.
  • ఇక May అనే పదంలో అసలు e అనే అక్షరమే ఉండదు.
  • అవును.. ఈ ప్రశ్నకు అసలు సిసలైన సమాధానం మరేదో కాదు.. ఆంగ్ల అక్షరం E.

సమాధానం ఇంత సింపుల్ అని తెలిసిన తర్వాత నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘‘అరెరే.. ఇంత చిన్న లాజిక్‌ను ఎలా మిస్సయ్యాం. మనం కొండలను జల్లడపడుతుంటే.. సమాధానం మాత్రం పక్కనే సులభంగా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *