Headlines

ఆ డైరెక్టర్ చాలా మంచి వాడు.. ఫ్లాపుల్లో ఉన్నా సాయనానికి ముందుంటాడు


దర్శకుడు మెహర్ రమేష్ గురించి రచయిత తోట ప్రసాద్‌ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తోట ప్రసాద్ ఒక సందర్భంలో తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్‌లో ఉన్నారు. ఆపరేషన్ కోసం డబ్బులు లేక సతమతమవుతున్నప్పుడు, మెహర్ రమేష్ ఆయనకు అండగా నిలబడ్డారని తెలిపారు. అయితే, ఆ సమయంలో మెహర్ రమేష్ స్వయంగా తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నారట. ఆయన దర్శకత్వం వహించిన శక్తి చిత్రం విడుదల తర్వాత వచ్చిన పరాజయం ఆయనను మానసికంగా కృంగదీసింది. ఈ పరిస్థితిలో కూడా, తోట ప్రసాద్ సమస్యను తెలుసుకుని చలించిపోయారట. అప్పటికే మహేష్ బాబుతో అనుకున్న తదుపరి ప్రాజెక్ట్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చి, తోట ప్రసాద్ ఆపరేషన్ ఖర్చులు ఆ సినిమా రెమ్యునరేషన్ నుంచి చెల్లిస్తానని హామీ ఇచ్చార మెహర్ రమేష్. కానీ ఆ సినిమా ప్రారంభం కాకముందే, తోట ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందట.

ఆ హీరోయిన్‌ను చూస్తే ఎవ్వరికైనా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది.. చాలా మంచింది : గుణశేఖర్

తోట ప్రసాద్ స్నేహితుడు రాజసింహ, దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు గారిని సంప్రదించారు. ఇండస్ట్రీలో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి తప్ప, బయటివారిని అడగకూడదని దాసరి గారు సూచించారట. దాసరి నారాయణరావు స్వయంగా తన నీడ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్ ఖర్చులకు కొంత మొత్తాన్ని హాస్పిటల్‌కు చెల్లించారట. అదే సమయంలో, మెహర్ రమేష్‌కు ఫోన్ చేసి తోట ప్రసాద్ పరిస్థితి వివరించారట. మెహర్ రమేష్ వెంటనే స్పందించి, తోట ప్రసాద్‌కు ధైర్యం చెప్పి, ఆపరేషన్‌కు అవసరమైన పూర్తి నిధులను కేవలం రెండు రోజుల్లోనే ఆయన అకౌంట్‌లో జమ చేశారట. అప్పటి నుండి, మెహర్ రమేష్ తోట ప్రసాద్‌ను ఏ రోజూ ఒంటరిగా వదిలిపెట్టలేదట, ప్రతి నెలా మందుల ఖర్చుల కోసం రూ. 20,000 నుంచి రూ.30,000 వరకు పంపేవారట.

BiggBoss 10: అమ్మబాబోయ్.. ఒకొక్కరికి అంత రెమ్యునరేషనా..! అందరికంటే ఎక్కువ ఎవరికో తెలుసా

2015లో తోట ప్రసాద్ మరోసారి తీవ్రమైన ప్రమాదానికి గురయ్యారు. ఒక సాయంత్రం వాకింగ్ చేస్తుండగా, మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు స్కూటీతో ఢీకొట్టడంతో ఆయన భుజంకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా ఎనిమిది లక్షల రూపాయల వరకు ఖర్చయ్యే షోల్డర్ బాల్ రీప్లేస్‌మెంట్ సర్జరీ అవసరమైంది. మళ్ళీ ఆర్థిక సంక్షోభం తలెత్తింది. హాస్పిటళ్లకు వెళ్లడానికి భయపడే మెహర్ రమేష్, తోట ప్రసాద్ వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు, రాత్రంతా హాస్పిటల్‌లో ఉండి, తోట ప్రసాద్ భార్యాబిడ్డలకు ధైర్యం చెప్పి, డాక్టర్లతో మాట్లాడి చికిత్సను కూడా పర్యవేక్షించారని తెలిపారు తోట ప్రసాద్.

ఇవి కూడా చదవండి



BiggBoss10: ఊహించని ట్విస్ట్.. హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్.. అతను అవుట్.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *