ఆ అర్చకులకు గర్భాలయంలోకి నో ఎంట్రీ

ఆ అర్చకులకు గర్భాలయంలోకి నో ఎంట్రీ


ఆ అర్చకులకు గర్భాలయంలోకి నో ఎంట్రీ

విదేశీయానం చేసిన అర్చకులు దేవాలయాల్లోని ప్రధాన గర్భాలయాల్లోకి ప్రవేశించి పూజలు చేయడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ జారీ చేసిన సర్క్యులర్లను, శృంగేరి శారదా పీఠం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మరియు కమిషనర్‌ను న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశించారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి చెందిన డి.ఎస్.ఎస్.ఎస్. సుబ్రహ్మణ్యం సోమయాజి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ తీర్పునిచ్చింది. వాదనల ప్రకారం.. 2010లో దేవాదాయ శాఖ జారీ చేసిన సర్క్యులర్, అలాగే 2024లో శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి విడుదల చేసిన ‘ప్రామాణిక’ మార్గదర్శకాల ప్రకారం.. విదేశాలకు వెళ్లిన అర్చకులు తిరిగి వచ్చాక ఆలయం వెలుపల జరిగే వ్రతాలు, పూజలకు మాత్రమే అర్హులు. వారు గర్భాలయంలోకి ప్రవేశించి మూలవిరాట్టుకు పూజలు నిర్వహించడానికి శాస్త్రం అంగీకరించదని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. నిత్యం త్రికాల సంధ్యావందనం, మంత్ర జపం, వేదాధ్యయనం మరియు కఠిన ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటించే వారే గర్భాలయ పూజలకు అర్హులని కోర్టు గుర్తు చేసింది. విదేశీ ప్రయాణాలు చేసిన వారు లేదా సంప్రదాయానికి విరుద్ధంగా జుట్టు కత్తిరించుకున్న వారు ఈ విధులకు అనర్హులని స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Trisha: ప్రేమపై త్రిష పోస్టు.. ట్రెండింగ్ లో లవ్ కోట్స్

తహసీల్దారుకే కుచ్చు టోపీ పెట్టిన కేటుగాడు.. ఏం చేశాడంటే

Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్‌ కాదు.. కొత్తగా ప్యాచప్‌..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్

Biker Collection: బాక్సాఫీస్‌ దగ్గర రఫ్ఫాడిస్తున్న బైకర్

Ramana Gogula: రమణ గోగుల నోట గమ్మత్తైన పాట



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *