Headlines

ఆర్బీఐ స్కీమ్‌కు అనూహ్య స్పందన.. ఎన్నారైల నుంచి పోటెత్తిన డాలర్లు


విదేశీ మారక నిధులను ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన వ్యూహాత్మక ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలనిచ్చాయి. మిడిల్‌ఈస్ట్ యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటడం, దిగుమతులు పెరగడంతో విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. డాలర్ ముందు రూపాయి విలువ సైతం భారీగా బలహీనపడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆర్బీఐ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి, విదేశీ మారక నిధులను దేశం వైపు మళ్లించేందుకు ప్రత్యేక యూఎస్ డాలర్-రూపాయి స్వాప్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయుల కోసం తీసుకొచ్చిన ఎఫ్‌సీఎన్‌ఆర్-బి పథకం అద్భుతంగా పనిచేసింది. ఈ పథకం ద్వారా విదేశాల్లో సంపాదిస్తున్న ఎన్‌ఆర్‌ఐలు తమ డాలర్లు, పౌండ్లు వంటి విదేశీ కరెన్సీని రూపాయల్లోకి మార్చకుండానే భారత బ్యాంకుల్లో నేరుగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకునే సదుపాయం లభించింది. గడువు పూర్తయిన తర్వాత అసలుతో పాటు వడ్డీని కూడా అదే విదేశీ కరెన్సీలో పొందవచ్చు. దీనివల్ల కరెన్సీ మార్పిడి నష్టాల భయం లేకపోవడంతో, ప్రవాస భారతీయులు తమ సంపాదనను భారత బ్యాంకుల్లో భారీగా డిపాజిట్ చేశారు. ఈ వ్యూహాత్మక ఎత్తుగడతో కేవలం మూడు నెలల వ్యవధిలోనే అంచనాలను తలకిందులు చేస్తూ భారీగా నిధులు దేశంలోకి వచ్చాయి. ఆర్బీఐ ప్రాథమిక గణాంకాల ప్రకారం ఆగస్టు 31 నాటికి ఏకంగా 136 బిలియన్ డాలర్లు అంటే…సుమారు రూ. 1.30 లక్షల కోట్ల నిధులు సమీకృతమయ్యాయి. ఇటీవలి భారత ఆర్థిక చరిత్రలో అత్యంత విజయవంతమైన డాలర్ల సమీకరణ ప్రయత్నాల్లో ఇది నిలిచింది. ఈ ఎన్‌ఆర్‌ఐల డాలర్ల వెల్లువతో దేశ ఫారెక్స్ నిల్వలు ఏకంగా 729 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. రూపాయి పడిపోతున్న వేళ ఈ భారీ నిధులు భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త బలాన్ని చేకూర్చాయి. ఏ సంక్షోభ సమయమైనా దేశానికి అండగా నిలవడంలో ప్రవాస భారతీయులు మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి మెత్తగా తాకిన దానిని చూసి హడల్‌!

Mirzapur: డిజిటల్లో బిగ్ హిట్ అయిన మీర్జాపూర్ ఇప్పుడు థియేటర్లలోకి

Sardar 2: విలన్‌గా విశ్వరూపం చూపిస్తున్న ఎస్.జె. సూర్య

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం.. పగలు ఉక్కపోత.. రాత్రికి జల్లులు

OG Universe: OG యూనివర్స్.. అన్నీ చెప్పారు ఆ ఒక్కటి తప్ప..!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *