అలా జరుగుతుందని అనుకోలేదు..! రెండు సార్లు అబార్షన్.. ఎమోష్నలైన టాలీవుడ్ హీరోయిన్

అలా జరుగుతుందని అనుకోలేదు..! రెండు సార్లు అబార్షన్.. ఎమోష్నలైన టాలీవుడ్ హీరోయిన్


అలా జరుగుతుందని అనుకోలేదు..! రెండు సార్లు అబార్షన్.. ఎమోష్నలైన టాలీవుడ్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో ఆమె  క్రేజీ హీరోయిన్..కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత మెయిన్ హీరోయిన్ గా చేసింది. ఈ అమ్మడి అందానికి, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. స్టార్ హీరోయిన్ గా రాణిస్తుందని అందరూ భావించారు. కానీ ఆతర్వాత ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ గా అనుకుంతగా అవకాశాలు రాలేదు. దాంతో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఆతర్వాత ఓ యంగ్ హీరోని పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులకు దగ్గరయింది. తన ఫ్యామిలీ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంది ఆ అందాల భామ. అయితే పెళ్లి జరిగి 9ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగకపోవడం పై ఆమె పై రకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చింది ఆ హీరోయిన్. ఇంతకూ ఆమె ఎవరంటే..

సినిమా చేయనని డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పేసిన జయప్రకాష్ రెడ్డి.. కానీ చివరకు

ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న హీరోయిన్ ఎవరో కాదు టాలీవుడ్ భామ వితిక షేరు. ఈ చిన్నది హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. అలాగే సెకండ్ హీరోయిన్ గానూ నటించి మెప్పించింది. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే యంగ్ హీరో వరుణ్ సందేశ్ ను వివాహం చేసుకుంది. ఈ జంట టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరూ ఆ మధ్య బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొన్నారు. కాగా నటనకు గ్యాప్ ఇచ్చిన వితిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఎన్టీఆర్ డైలాగ్‌తో అదరగొట్టిన కమెడియన్.. ఆశ్చర్యపోయిన బాలయ్య.. వీడియో వైరల్

కాగా ఈ జంటకు పెళ్ళై 9ఏళ్లు అవుతుంది. అయితే ఇంతవరకు పిల్లలు పుట్టాక పోవడం పై రకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్ పై వితిక క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వితిక మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. 2019లో వరుణ్, వితిక అమెరికాలో ఉండాలని అనుకున్నారట.. ఆ సమయంలోనే వితిక గర్భవతి అయ్యిందట. ఆ వార్త తెలిసి రెండు కుటుంబాల వారు ఎంతో సంతోషించారని.. కానీ ఇంతలోనే తనకు తీవ్రమైన గర్భస్రావం కావడంతో ఆ బాధను తట్టుకోలేకపోయిన వారు వెంటనే ఇండియాకు తిరిగి వచేశారట.. అయితే  గర్భం దాల్చిన 40రోజుల్లోనే ఎక్కువగా ప్రయాణాలు చేయడంతో అబార్షన్ అయ్యిందని తెలిపింది వితిక.. ఆ సమయంలో తనకు ఆవిషయం తెలియదని ఎమోషనల్ అయ్యింది..  ఆతర్వాత గర్భస్రావం కావడంతో బేబీకి సంబంధించిన కొంతభాగం గర్భలోనే ఉండటంతో మరోసారి గర్భవతిని అయినా భ్రమ కలిగిందని.. అయితే అది ప్రాణాపాయం అని తెలిసి వైద్యులు మరోసారి అబార్షన్ చేశారని తెలిపింది. ఇలా వరుసగా రెండు సార్లు జరగడంతో అవి తనను శరీరకంగానే కాకుండా మానసికంగానూ కుంగదీశాయని.. ఆ సమయంలో తన భర్త వరుణ్ సాయంతోనే దాని నుంచి బయటపడగలిగాను అని తెలిపింది వితిక.

నా ఇన్ స్టా‌గ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌‌లో అలాంటివి ఉండవు.. అది బూతు కంటెంట్ కోసం మాత్రమే కాదంటున్న హీరోయిన్

 

View this post on Instagram

 

A post shared by Vithika Sheru (@vithikasheru)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *