అరటిపండ్ల విషయానికి వస్తే, వీటిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఒక మధ్యస్థ పరిమాణపు అరటిపండులో సుమారు 100 నుండి 150 కేలరీలు ఉంటాయి. వీటిలో సహజ చక్కెరలతో పాటు పిండి పదార్థాలు ఉండటం వల్ల శరీరానికి నిరంతరాయంగా, స్థిరమైన శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా అరటిపండ్లలో ఉండే పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి వంటి పోషకాలు శరీర అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా కండరాల పనితీరును మెరుగుపరచడంలో పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వ్యాయామం చేసే సమయంలో వచ్చే కండరాల తిమ్మిర్లను తగ్గించడానికి సహాయపడుతుంది.