Headlines

Zero Tax: రూ.15 లక్షల శాలరీ ఉన్నా జీరో ట్యాక్స్‌.. కొత్త పన్ను విధానంలో ఈ ట్రిక్స్ తెలుసుకోండి..!

Zero Tax: రూ.15 లక్షల శాలరీ ఉన్నా జీరో ట్యాక్స్‌.. కొత్త పన్ను విధానంలో ఈ ట్రిక్స్ తెలుసుకోండి..!


సాధారణంగా కొత్త పన్ను విధానంలో (New Tax Regime) మినహాయింపులు తక్కువగా ఉంటాయని చాలామంది భావిస్తారు. కానీ, నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకుంటే ఏడాదికి రూ. 15 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు కూడా సరైన ప్లానింగ్‌తో ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ఇది కూడా చదవండి: Silver Price: దిమ్మదిరిగే షాకిచ్చిన సిల్వర్‌ ధర.. రూ.55 వేలు పెరిగిన వెండి.. ప్రస్తుతం ఎంతంటే..!

1. స్టాండర్డ్ డిడక్షన్

కొత్త పన్ను విధానంలో వేతన జీవులకు ప్రభుత్వం రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను కల్పిస్తోంది. అంటే మీ మొత్తం ఆదాయం నుండి నేరుగా ఈ మొత్తాన్ని తగ్గించి పన్ను లెక్కిస్తారు.

ఇవి కూడా చదవండి

2. అలవెన్సులు

కొత్త పన్ను విధానంలో పాత పద్ధతిలో లాగా సెక్షన్ 80C లేదా HRA మినహాయింపులు ఉండవు. కానీ, కొన్ని రకాల అలవెన్సుల ద్వారా పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు:

  • గ్రాట్యుటీ (Gratuity): ఒక కంపెనీలో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగికి వచ్చే గ్రాట్యుటీపై రూ. 25 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.
  • లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ (Leave Encashment): పదవీ విరమణ సమయంలో పొందే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై రూ. 25 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది.
  • ఎన్పీఎస్ (NPS – Tier 1): యజమాని (Employer) మీ NPS ఖాతాలో జమ చేసే మొత్తం (బేసిక్ శాలరీలో 10% లేదా 14% వరకు) పన్ను పరిధిలోకి రాదు.
  • ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్: దివ్యాంగులకు నెలకు రూ. 3,200 వరకు రవాణా ఖర్చులపై మినహాయింపు ఉంటుంది.

ఇది కూడా చదవండి: School Holidays: అక్కడ జూన్‌ 30 వరకు పాఠశాలలకు సెలవులు.. జూలై 1న ఓపెన్‌..!

3. ఆఫీస్ ఖర్చుల రీయింబర్స్‌మెంట్

  • ఆఫీస్ పని నిమిత్తం మీరు చేసే కొన్ని ఖర్చులపై పన్ను మినహాయింపు పొందవచ్చు:
  • కన్వేయన్స్ అలవెన్స్: ఆఫీస్ పని మీద ప్రయాణించినప్పుడు అయ్యే ఖర్చు.
  • డైలీ అలవెన్స్: ఆఫీస్ పని మీద బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు అయ్యే ఖర్చు.
  • హెల్పర్ అలవెన్స్: విధుల్లో భాగంగా హెల్పర్‌ను నియమించుకుంటే దానికి అయ్యే ఖర్చు.

4. పన్ను రాయితీ (Tax Rebate under 87A)

కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం (Taxable Income) ఉన్నవారికి ప్రభుత్వం పూర్తి పన్ను రాయితీని ఇస్తోంది. అంటే పైన పేర్కొన్న అలవెన్సులు, ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్, స్టాండర్డ్ డిడక్షన్స్ పోను మీ ఆదాయం రూ. 12 లక్షల లోపు ఉంటే, మీరు పన్ను చెల్లించక్కర్లేదు.

ముఖ్య గమనిక:

రూ. 15 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి తన జీతంలో కొంత భాగాన్ని NPS కంట్రిబ్యూషన్, స్టాండర్డ్ డిడక్షన్, కంపెనీ ఇచ్చే ఇతర ట్యాక్స్-ఫ్రీ అలవెన్సుల ద్వారా సర్దుబాటు చేయగలిగితే, పన్ను భారాన్ని సున్నాకు తగ్గించుకోవడం సాధ్యమే. అయితే, ఇది మీ కంపెనీ ఇచ్చే ‘శాలరీ స్ట్రక్చర్’ (Salary Structure) పై ఆధారపడి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Fuel Saving Tips: వార్నీ.. ఇన్నాళ్లు ఈ విషయం తెలియకపాయే.. ఆ టైమ్‌లో పెట్రోల్‌ కొట్టిస్తే ఎక్కువ వస్తుందా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *