ఆ మూడు గంటలే కీలకం: చాలామంది వినియోగదారులు రోడ్ల పక్కన ముక్కలు కోసి పెట్టిన పుచ్చకాయలను కొంటుంటారు. దుకాణదారులు పండు ఎరుపును చూపించడానికి గాట్లు పెట్టి గంటల తరబడి వదిలేస్తుంటారు. ఇక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. పుచ్చకాయలో 92శాతం నీరు, సహజ చక్కెరలు ఉంటాయి. ఒక్కసారి పండును కోసిన తర్వాత గాలిలోని తేమ, వేడి తగిలితే.. సాల్మొనెల్లా, లిస్టెరియా వంటి ప్రమాదకర బ్యాక్టీరియాలు వేగంగా వృద్ధి చెందుతాయి. అదేవిధంగా కోసిన పుచ్చకాయ ముక్కలు సాధారణ ఉష్ణోగ్రత వద్ద 2 గంటల కంటే ఎక్కువ సేపు ఉంటే, అవి తినడానికి ఏమాత్రం సురక్షితం కాదు. ముఖ్యంగా వేసవి వేడికి బ్యాక్టీరియా రెట్టింపు వేగంతో పెరుగుతుంది.