ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజీబాద్లో ఆదివారం ఉదయం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఘజీయాబాద్కు చెందిన ఇక్రా అనే 19 ఏళ్ల యువతి తన స్నేహితుడు హషీమ్ (20)తో కలిసి యమహా R-15 స్పోర్ట్స్ బైక్పై బయటకు వెళ్లింది. అయితే ఈ క్రమంలో బైక్ను ఆమె నడుపుతానని.. హమీమ్తో చెప్పడంతో అతను బైక్ను ఇక్రాకు ఇచ్చాడు..దీంతో ఇక్రా బైక్ నడుపుతుండగా హమీమ్ వెనకనుంచి వీడియో తీస్తున్నాడు.. అయితే బైక్ అతివేగంగా ఉండటంతో అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇక్రా అక్కడికక్కడే మృతి చెందగా హమీమ్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఇక్రా బైక్ నడుపుతున్నట్టు హమీమ్ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక్రా కనీసం హెల్మెట్ లేకుండా అతి వేగంగా బైక్ నడుపుతున్న దృశ్యాన్ని మనం వైరల్ వీడియోలో చూడవచ్చు.
అయితే ప్రమాద సమచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇక్రా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన హమీమ్ను హాస్పిటల్కు తరలించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే శనివారం ఉదయం వీరిద్దరూ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లినట్టు పోలీసులకు కుటుంబ సభ్యులు తెలిపారు. హషీమ్ తండ్రి కమ్రుద్దీన్ తన కుమారుడికి ఫోన్ చేయగా తాము బయటకు వచ్చామని.. త్వరలోనే తిరిగి వస్తాం అని చెప్పినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
వీడియో చూడండి..
🚨 BREAKING
A tragic accident in Ghaziabad a high-speed sports bike crashed into a divider, leading to the death of Ikra.💔
Reports say Ikra was riding the bike while her friend Hashim was filming a video at the time of the crash. Neither of them was wearing a helmet.
One… pic.twitter.com/fxo9mYASLR
— Rehan_Idrisi (@MR_COOL77777) April 13, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.