పాములతో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. రెప్పపాటులోనే అవి కాటేస్తాయి.. కింగ్ కోబ్రా పామును పట్టుకున్న ఓ వ్యక్తి.. సరదా అతని ప్రాణం పోయేలా చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక హృదయ విదారక వీడియో ఇప్పుడు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. పాములను పట్టుకోవడంలో ఆరితేరిన ఒక స్నేక్ క్యాచర్.. విషపూరితమైన త్రాచుపామును పట్టుకున్నాడు.. అనంతరం దానితో సరదాగా ఆడుకునే ప్రయత్నంలో అది కాటు వేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ భయంకరమైన దృశ్యాలు మొత్తం కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే.. ఈ ఘటన బీహార్ లో జరిగినట్లు పేర్కొంటున్నారు.
అసలేం జరిగింది?
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. సదరు వ్యక్తి ఒక నివాస ప్రాంతంలోకి చొరబడిన పామును పట్టుకోవడానికి వెళ్లాడు. సాధారణంగా పాములను పట్టుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు తీసుకున్నాడు.. అనంతరం పామును బంధించే క్రమంలో దానితో సరదాగా ఆడుకుంటుంగా.. ఆ పాము ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. పాము కాటు వేసిన కొద్ది నిమిషాల్లోనే విషం శరీరం అంతటా పాకడంతో, అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించే లోపే అతను మరణించాడు.
వీడియో చూడండి..
सांप पकड़ने आए व्यक्ति को सांप के साथ खेलना भारी पड़ा, 3 मिनट के अंदर लाइव वीडियो में दर्दनाक मौ**त ! pic.twitter.com/9XNWHn1bI6
— अमित गांधी, Amitt Gandhi, امیت گاندھی (@amitt_gandhi) May 1, 2026
అయితే.. ఈ ఘటన ఎక్కడ జరిగింది..? ఎప్పుడు జరిగింది అనేది స్పష్టంగా తెలియరాలేదు.. కానీ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అజాగ్రత్త వల్ల..
ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అనుభవం ఉన్న వ్యక్తులు కూడా ఒక్కోసారి చేసే చిన్న పొరపాటు ప్రాణాల మీదకు తెస్తుందని ఈ ఘటన నిరూపించింది. ముఖ్యంగా పాములతో విన్యాసాలు చేయడం లేదా వాటిని తక్కువ అంచనా వేయడం ఎంత ప్రమాదకరమో ఈ వీడియో హెచ్చరిస్తోంది.
పాములు నివాస ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు సొంత ప్రయోగాలు చేయకుండా, వెంటనే అటవీ శాఖ అధికారులకు లేదా శిక్షణ పొందిన నిపుణులకు సమాచారం అందించడం మంచిది. విషపూరితమైన జీవులతో వ్యవహరించేటప్పుడు అనుక్షణం జాగ్రత్తగా ఉండాలని.. భద్రతా ప్రమాణాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..