
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా తడోబా అభయారణ్యం సమీపంలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. తల్లి పులి తన పసికూనలతో కలిసి ప్రధాన రహదారిపై సంచరిస్తూ ప్రయాణికులకు కనువిందు చేసింది. అభయారణ్యం నుంచి బయటకు వచ్చిన ఈ పులుల గుంపు మోహర్లీ మార్గంలో నెమ్మదిగా నడుస్తూ కనిపించింది. మూడు నెలల పాటు తడోబా అభయారణ్యంలో పర్యాటకుల ప్రవేశాన్ని నిలిపివేయడంతో అడవిలో వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో రహదారిపై ప్రత్యక్షమైన తల్లి పులి, దాని పసికూనలను ఓ ప్రయాణికుడు తన కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, వన్యప్రాణుల నివాస ప్రాంతాల్లో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..