Viral News: పల్లె ఒడిలో ప్రకృతి వింత.. ఈ పుట్టగొడుగు చూశారా ఎంత పెద్దగా ఉందో..

Viral News: పల్లె ఒడిలో ప్రకృతి వింత.. ఈ పుట్టగొడుగు చూశారా ఎంత పెద్దగా ఉందో..


పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలో అరుదైన పుట్టగొడుగు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గ్రామానికి చెందిన పీ. జీవన్ కుమార్ ఇంటి పెరట్లో అసాధారణ పరిమాణంలో భారీ పుట్టగొడుగు ఒక్కసారిగా పెరిగి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా మనం చూసే పుట్టగొడుగులతో పోలిస్తే ఇది ఎన్నో రెట్లు పెద్దగా ఉండటంతో గ్రామస్థులంతా దీన్ని ఆశ్చర్యంగా వీక్షిస్తున్నారు. ఈ భారీ పుట్టగొడుగును చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరలివస్తున్నారు. ఇంత పెద్ద పుట్టగొడుగు మేమెప్పుడూ చూడలేదు అంటూ ఆశ్చర్యపోతూ కొందరు మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు.

చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని దగ్గరగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు దీన్ని అరుదైన ప్రకృతి సంఘటనగా భావిస్తుండగా, మరికొందరు వాతావరణ మార్పుల ప్రభావమని చర్చించుకుంటున్నారు. ఇటీవల కురిసిన వరుస వర్షాలు, నేలలో పెరిగిన తేమ, అనుకూల వాతావరణ పరిస్థితులు కలిసివచ్చి ఇలాంటి భారీ పుట్టగొడుగులు పెరగడానికి కారణమవుతాయని స్థానికులు భావిస్తున్నారు.

ప్రకృతి సహజ సిద్ధంగా అందించే ఈ తరహా ఆశ్చర్యకర దృశ్యాలు గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడప్పుడు కనిపిస్తాయని పెద్దలు చెబుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. సహజసిద్ధమైన ఈ అరుదైన దృశ్యాన్ని చూడటానికి ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో గుమ్మలక్ష్మీపురం గ్రామంలో జెయింట్ పుట్టగొడుగు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *