Vijay Deverakonda: ‘హాయ్ నాన్న’ డైరెక్టర్‌తో విజయ్‌ దేవరకొండ సినిమా.. ముందుగా ఆ స్టార్ హీరోను అనుకుని..

Vijay Deverakonda: ‘హాయ్ నాన్న’ డైరెక్టర్‌తో విజయ్‌ దేవరకొండ సినిమా.. ముందుగా ఆ స్టార్ హీరోను అనుకుని..


పెళ్లయ్యాక విజయ్ దేవరకొండ స్పీడ్ పెంచాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే రణబాలి, రౌడీ జనార్దన్ వంట క్రేజీ ప్రాజెక్టులు ఉండగా లేటెస్ట్ గా మరో కొత్త సినిమాను ప్రకటించాడీ రౌడీ హీరో. ‘హాయ్ నాన్న’ వంటి క్లాసిక్ హిట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ శౌర్యువ్ తో కొత్త సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమా ఓపెనింగ్ కు హాజరై క్లాప్ కొట్టి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. అంతకు ముందు ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే హాయ్ నాన్న తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు డైరెక్టర్ శౌర్యువ్. అయితే ఈ మధ్యలో తన తర్వాతి సినిమాను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో చేయాలనుకున్నాడు. ఆయన కోసం ఒక కథను కూడా రెడీ చేసుకుని చాలా కాలం పాటు వేచి చూశాడు కూడా. అయితే ఎన్టీఆర్ వరుసగా దేవర, వార్ 2, డ్రాగన్ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. శౌర్యువ్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాడు. దీంతో ఈ డైరెక్టర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.

తారక్ తో అనుకున్న సినిమా ఆలస్యం అవుతుండడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో జతకట్టేందుకు రెడీ అయ్యాడు. అయితే శౌర్యూవ్ ఎన్టీఆర్ కోసం అనుకున్న కథను విజయ్ దేవరకొండ ఇమేజ్‌కు తగినట్లుగా మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా హీరోయిన్స్, ఇతర క్యాస్టింగ్ వివరాలను ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

పోస్టర్ తోనే ఆసక్తిని పెంచేశారు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *