Headlines

Video: పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్.. హర్షిత్‌కు ఘాటు సెండాఫ్.. అడ్డుకున్న తిలక్‌పైనా దూకుడు..


Pakistan A Sledging: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026లో భారత్-Aతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్-A ఆటగాళ్లు హద్దు మీరి ప్రవర్తించారు. ఛేజింగ్‌లో టీమిండియా వికెట్ కోల్పోయినప్పుడల్లా అతిగా స్పందిస్తూ స్లెడ్జింగ్‌కు దిగారు. పెవిలియన్‌కు వెళ్తున్న భారత ప్లేయర్లను కవ్విస్తూ రెచ్చగొట్టారు.

ముఖ్యంగా హర్షిత్ రాణా ఔట్ అయిన సమయంలో పాక్ ఆటగాళ్లు మరింత రెచ్చిపోయారు. అతడి ముఖం ముందే అరుస్తూ ఘాటైన సెండాఫ్ ఇచ్చారు. దీంతో క్రీజులో ఉన్న కెప్టెన్ తిలక్ వర్మ వెంటనే జోక్యం చేసుకుని పాక్ ప్లేయర్లను అడ్డుకున్నాడు.

ఒక దశలో తిలక్ మీదకూ వెళ్లేందుకు పాక్ ఆటగాడు (అలీ – జెర్సీ నం.12) యత్నించగా, అంపైర్ రంగంలోకి దిగి ఇరు జట్లను శాంతింపజేశారు. ఆ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశిని కూడా ముందు నుంచే స్లెడ్జ్ చేసినట్లు తెలుస్తోంది.

314 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-A 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే మ్యాచ్ ఫలితం కంటే పాక్ ఆటగాళ్ల ఓవరాక్షన్ వ్యవహారమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పోర్ట్స్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ నెటిజన్లు పాక్ టీమ్‌పై మండిపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *