Video: చూడలేకపోయానని కన్నీళ్లు.. కట్ చేస్తే.. బుడ్డోడికి సర్ప్రైజ్ ఇచ్చిన సంజూ శాంసన్.!

Video: చూడలేకపోయానని కన్నీళ్లు.. కట్ చేస్తే.. బుడ్డోడికి సర్ప్రైజ్ ఇచ్చిన సంజూ శాంసన్.!


Video: చూడలేకపోయానని కన్నీళ్లు.. కట్ చేస్తే.. బుడ్డోడికి సర్ప్రైజ్ ఇచ్చిన సంజూ శాంసన్.!

Sanju Samson Viral Video: కొద్దిరోజుల క్రితం సంజూ శాంసన్ కేరళలోని కోజికోడ్‌ పర్యటనకు వెళ్లాడు. అక్కడ మలబార్ క్రిస్టియన్ కాలేజీ మైదానంలో కొంతమంది పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ గడిపాడు. అయితే ఆ సమయంలో సంజూను నేరుగా కలిసే అవకాశం దక్కలేదని ఆరవ తరగతి చదువుతున్న ఒక బాలుడు కెమెరా ముందు విపరీతంగా ఏడ్చాడు. తనకు సంజూను చూసే అదృష్టం లేదని, తనకెవరూ సహాయం చేయడం లేదని ఆ బాలుడు కంటతడి పెట్టుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంజూ స్పందన – వీడియో కాల్ ముచ్చట..

ఈ వీడియో నెమ్మదిగా సంజూ శాంసన్ స్నేహితుడు రాహుల్ రాఘవన్, అభిమాన సంఘాల ద్వారా సంజూ దృష్టికి చేరింది. తన కోసం ఒక చిన్నారి అంతలా బాధపడుతున్నాడని తెలుసుకున్న సంజూ, వెంటనే ఆ బాలుడికి వీడియో కాల్ చేశాడు. ఫోన్ ఎత్తగానే అవతలి వైపు సాక్షాత్తు తన ఆరాధ్య దైవం సంజూ శాంసన్ ఉండటంతో ఆ బాలుడు ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. ఆనందంతో అతడి కళ్లలో మళ్లీ నీళ్లు తిరిగాయి.

సంజూ సంభాషణ – అభిమానికి భరోసా..

 

View this post on Instagram

 

A post shared by Medhamayuri🦋 (@medhamayurii)

వీడియో కాల్‌లో సంజూ చాలా సరదాగా మాట్లాడాడు. “స్కూల్‌కు వెళ్లలేదా? సెలవు ఇచ్చారా? క్రికెట్ ప్రాక్టీస్ ఎలా సాగుతోంది?” అని ఆరా తీశాడు. బాలుడు గౌరవంగా ‘సార్’ అని పిలవగా.. “నన్ను సార్ అని పిలవద్దు, సంజూ అని పిలిస్తే చాలు” అని నవ్వుతూ చెప్పాడు. అంతేకాకుండా, అనవసరంగా ఏడవద్దని ఆ చిన్నారికి సర్దిచెప్పాడు. “వచ్చేసారి ఆ ఊరికి వచ్చినప్పుడు కచ్చితంగా నిన్ను కలుస్తాను, మనం కలిసి క్రికెట్ ఆడదాం” అని సంజూ మాటివ్వడంతో ఆ బాలుడు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

గతంలో బాధతో ఏడ్చిన ఆ బాలుడు, ఇప్పుడు సంజూతో మాట్లాడి ఆనందంతో ఏడుస్తున్న దృశ్యాలు నెటిజన్లను కదిలిస్తున్నాయి. సంజూ శాంసన్ కేవలం గొప్ప ఆటగాడు మాత్రమే కాదు, అంతకంటే గొప్ప వ్యక్తిత్వం గల మనిషి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా సంజూ తన ప్రవర్తనతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంటున్నారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *