Video: అడవిలో నుంచి వెళ్తున్న బస్సు.. సైడ్ ఇవ్వలేదని ఈ మందుబాబు ఏం చేశాడో మీరే చూడండి..

Video: అడవిలో నుంచి వెళ్తున్న బస్సు.. సైడ్ ఇవ్వలేదని ఈ మందుబాబు ఏం చేశాడో మీరే చూడండి..


Video: అడవిలో నుంచి వెళ్తున్న బస్సు.. సైడ్ ఇవ్వలేదని ఈ మందుబాబు ఏం చేశాడో మీరే చూడండి..

చుట్టూ దట్టమైన అడవి.. సాయంత్రం వేళ ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు. ఇంతలో వెనుక నుంచి ఒక బైక్.. పదే పదే హారన్ కొడుతూ బీభత్సం. బస్సు సైడ్ ఇవ్వలేదన్న చిన్న కారణంతో ఓ మద్యం మత్తులో ఉన్న వ్యక్తి రెచ్చిపోయాడు. సినిమా సీన్‌ను తలపించేలా బస్సును వెంబడించి, అడ్డగించి, రాళ్లతో దాడికి పాల్పడిన ఈ ఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం నుంచి వరంగల్ జిల్లా నర్సంపేటకు బయలుదేరింది. బస్సు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ – పాకాల మధ్య ఉన్న అటవీ మార్గంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో బస్సు వెనుక ద్విచక్ర వాహనంపై వస్తున్న ఒక వ్యక్తి, బస్సును ఓవర్‌టేక్ చేసేందుకు పదే పదే హారన్ కొట్టాడు. అయితే, ఆ మార్గం సింగిల్ రోడ్డు కావడం, అటవీ ప్రాంతం కావడంతో బస్సు డ్రైవర్ కొంత దూరం వరకు అతనికి సైడ్ ఇచ్చే అవకాశం లేకపోయింది. దీనిని మనసులో పెట్టుకున్న ఆ వాహనదారుడు, మద్యం మత్తులో ఊగిపోతూ మరింత వేగంగా బస్సును ఓవర్‌టేక్ చేసి, అమాంతం బస్సుకు అడ్డంగా తన బైక్‌ను నిలిపివేశాడు.

రాళ్లతో దాడి.. ప్రయాణికుల హాహాకారాలు

బస్సు ఆగగానే ఊగిపోయిన ఆ వ్యక్తి.. డ్రైవర్, కండక్టర్‌తో అసభ్య పదజాలంతో దూషిస్తూ గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా కింద ఉన్న రాళ్లను తీసుకుని బస్సుపై దాడికి పాల్పడ్డాడు. రాళ్ల దాడిలో బస్సు ముందు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జనసంచారం లేని అటవీ ప్రాంతంలో బస్సును ఆపి, ఆ వ్యక్తి సృష్టించిన భీభత్సాన్ని చూసి బస్సులో ఉన్న ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

పోలీస్ స్టేషన్‌కు ఆర్టీసీ బస్సు

నిందితుడు వీరంగం సృష్టించిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ సిబ్బంది, అదే బస్సులో ఖానాపురం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. జరిగిన ఘటనపై పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *