Varun Tej: వరుణ్‌ తేజకు గాయం.. అపోలోలో సర్జరీ !!

Varun Tej: వరుణ్‌ తేజకు గాయం.. అపోలోలో సర్జరీ !!


ఓ బిగ్ హిట్ కోసం కాచుకు కూర్చున్న మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌.. తన కెరీర్లో వర్సటైల్ కథలను ఎంచుకుంటుపోతున్నాడు. ఎలాగైన బాక్సాఫీస్ దగ్గర బిగ్గరగా సౌండ్ చేయాలని చూస్తున్నాడు. ఈక్రమంలోనే తన చెల్లి ప్రొడక్షన్లో.. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో బరి చేస్తున్నాడు. ఫుట్ బాల్‌ ఆటగాడిగా సిల్వర్ స్క్రీన్‌ పై అందర్నీ ఫిదా చేసే ప్రయత్నం ఇప్పటికే మొదలెట్టాడు. ప్రత్యేకంగా ఫుట్‌ బాల్‌ను ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే అలా ఫుట్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ గాయపడ్డాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌.. మంగళవారం ఫుట్ బాల్ ఆడుతున్న సమయంలో ఆయన కాలికి తీవ్రమైన గాయం అయ్యిందని తెలుస్తోంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి చిన్నపాటి శస్త్రచికిత్స అవసరమని సూచించారట. దీంతో అపోలో ఆసుపత్రిలో వరుణ్‌ తేజ్‌ మెకాలికి సర్జరీ విజయవంతంగా పూర్తయ్యిందని, ఆయన కోలుకుంటున్నారని చిత్ర బృందం వెల్లడించింది.వైద్యులు వరుణ్ తేజ్‌కు కనీసం కొన్ని వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. దీనివల్ల ‘బరి’ చిత్ర షూటింగ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. వరుణ్ తేజ్ తన పాత్రల కోసం శారీరకంగా చాలా కష్టపడుతుంటారని, ఈ క్రమంలోనే ఈ గాయం జరిగిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: డెకాయిట్‌కు చరణ్ అదిరిపోయే రివ్యూ..

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ లవ్ స్టోరీలో.. బిగ్ ట్విస్ట్

నాగార్జున వద్దు.. నా సినిమాలో శ్రీకాంతే కావాలి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *