Vaibhav Suryavanshi : 4 మ్యాచ్‌ల్లో 200 రన్స్.. 266 స్ట్రైక్ రేట్.. బుమ్రా, బోల్ట్, హెజిల్‌వుడ్.. ఎవరైతే నాకేంటి?

Vaibhav Suryavanshi :  4 మ్యాచ్‌ల్లో 200 రన్స్.. 266 స్ట్రైక్ రేట్.. బుమ్రా, బోల్ట్, హెజిల్‌వుడ్.. ఎవరైతే నాకేంటి?


Vaibhav Suryavanshi :  4 మ్యాచ్‌ల్లో 200 రన్స్.. 266 స్ట్రైక్ రేట్.. బుమ్రా, బోల్ట్, హెజిల్‌వుడ్.. ఎవరైతే నాకేంటి?

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు, 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. చిన్న వయసులోనే దిగ్గజ బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఈ బీహార్ కుర్రాడు, ఇప్పుడు క్రికెట్ ప్రపంచానికి కొత్త వండర్ బాయ్‎గా మారాడు. కేవలం తన బ్యాటింగ్‌తోనే కాకుండా, ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటున్న తీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఓపెనర్‌గా వస్తున్న వైభవ్ సూర్యవంశీ, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 200 పరుగులు సాధించాడు. ఇందులో రెండు మెరుపు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేవలం పరుగులు చేయడమే కాదు, అవి చేస్తున్న వేగం చూస్తే దిగ్గజ బ్యాటర్లే విస్తుపోవాలి. ఈ సీజన్‌లో అతని స్ట్రైక్ రేట్ 266.66గా ఉండటం విశేషం. ఇప్పటివరకు అతను తన ఇన్నింగ్స్‌లలో 18 ఫోర్లు, 18 సిక్సర్లు బాదాడు.

దిగ్గజ బౌలర్లకు వెల్‌కమ్ బౌండరీలతోనే

వైభవ్ బ్యాటింగ్ శైలి చాలా ప్రత్యేకం. ఎంతటి గొప్ప బౌలర్ ఎదురుగా ఉన్నా, తాను ఎదుర్కొనే తొలి బంతినే బౌండరీకి తరలించడం ఈ కుర్రాడికి అలవాటుగా మారింది. రీసెంట్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో, స్టార్ బౌలర్ జోష్ హెజిల్‌వుడ్ వేసిన తొలి బంతికి ఫోర్, రెండో బంతికి మరో ఫోర్ కొట్టి షాక్ ఇచ్చాడు. తనకంటే ఎంతో అనుభవం ఉన్న బౌలర్లను కూడా ఏమాత్రం లెక్కచేయకుండా భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు.

బుమ్రా, బోల్ట్ లపై అటాక్

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ప్రపంచ నంబర్ వన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన తొలి బంతికే సిక్స్ కొట్టి తానెంటో నిరూపించుకున్నాడు. అదే ఓవర్లో మరో సిక్సర్ కూడా బాది బుమ్రానే ఆశ్చర్యపరిచాడు. ఇక ట్రెంట్ బోల్ట్ వేసిన తొలి బంతిని కూడా స్టాండ్స్‌లోకి పంపించాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ మాట్ హెన్రీ ని సైతం వదలకుండా తొలి బంతికే ఫోర్ కొట్టి స్వాగతం పలికాడు.

భవిష్యత్తు స్టార్‌గా వైభవ్

కేవలం 15 ఏళ్ల వయసులో ఇంతటి పరిణతితో బ్యాటింగ్ చేయడం, ఒత్తిడిని అధిగమించడం సామాన్యమైన విషయం కాదు. ఇప్పటికే అండర్-19 వరల్డ్ కప్ లో తన సత్తా చాటిన వైభవ్, ఇప్పుడు ఐపీఎల్ వేదికగా అంతర్జాతీయ స్థాయి బౌలర్లను తన బ్యాట్‌తో భయపెడుతున్నాడు. ఇతని హిట్టింగ్ పవర్ మరియు ధైర్యం చూస్తుంటే, భారత క్రికెట్ కు మరో సెన్సేషనల్ ఓపెనర్ దొరికాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ పెట్టిన రూ.1.10 కోట్ల పెట్టుబడికి వైభవ్ వంద రెట్ల న్యాయం చేస్తున్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *