Vaibhav Suryavanshi : వైభవ్ బ్రో.. గవాస్కర్ సార్ మాట విను.. లేదంటే బౌలర్లు నిన్ను హోం వర్క్ చేసి మరీ బురిడీ కొట్టిస్తారు

Vaibhav Suryavanshi : వైభవ్ బ్రో.. గవాస్కర్ సార్ మాట విను.. లేదంటే బౌలర్లు నిన్ను హోం వర్క్ చేసి మరీ బురిడీ కొట్టిస్తారు


Vaibhav Suryavanshi : వైభవ్ బ్రో.. గవాస్కర్ సార్ మాట విను.. లేదంటే బౌలర్లు నిన్ను హోం వర్క్ చేసి మరీ బురిడీ కొట్టిస్తారు

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి పెద్ద జట్లపై కూడా భయం లేకుండా దూకుడుగా ఆడుతూ వార్తల్లో నిలిచాడు. బంతి పడకముందే లెంగ్త్‌ను కనిపెట్టే అతని టెక్నిక్, ఎదురుదాడి చేసే నైజం చూసి సాక్షాత్తు సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలే ఫిదా అయ్యారు.

వైభవ్ ఆటతీరు చూసి మురిసిపోతున్న అభిమానులకు, విశ్లేషకులకు గవాస్కర్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. ఒక యువ ఆటగాడిని అతిగా ఆకాశానికి ఎత్తేయడం వల్ల అతనిపై అదనపు ఒత్తిడి పెరుగుతుందని, అది అతని సహజమైన ఆటను దెబ్బతీస్తుందని సన్నీ ఆందోళన వ్యక్తం చేశారు. “వైభవ్ ఇంకా తన ప్రయాణం మొదట్లోనే ఉన్నాడు. అప్పుడే అతన్ని సూపర్ స్టార్ అని ముద్ర వేయడం వల్ల అతని కెరీర్‌కే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది” అని ఆయన పేర్కొన్నారు.

ఒక కొత్త బ్యాటర్ మొదటి కొన్ని మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడవచ్చు, ఎందుకంటే బౌలర్లకు అతని బలహీనతలు తెలియవు. కానీ ఇప్పుడు వైభవ్ అందరి దృష్టిలో పడ్డాడు. ప్రత్యర్థి జట్ల విశ్లేషకులు అతని ఆటను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని గవాస్కర్ గుర్తు చేశారు. వైభవ్ ఏ ఏరియాలో ఇబ్బంది పడుతున్నాడు? ఏ బంతులకు తడబడుతున్నాడు? అనేది కనిపెట్టి బౌలర్లు పక్కా ప్లాన్‌తో వస్తారని, ఆ సమయంలో నిలకడగా ఆడటమే అసలైన పరీక్ష అని ఆయన విశ్లేషించారు.

భవిష్యత్తుపై గవాస్కర్ సలహా 

వైభవ్ కేవలం ఒక టీనేజ్ సెన్సేషన్‌గా మిగిలిపోకూడదని, భారత క్రికెట్‌లో సుదీర్ఘ కాలం కొనసాగాలంటే ఇప్పుడు తన టెక్నిక్‌లో ఉన్న చిన్నపాటి లోపాలను సరిదిద్దుకోవాలని గవాస్కర్ సూచించారు. వైఫల్యాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, విజయం వచ్చినప్పుడు అతిగా గర్వపడకుండా ఉండటమే గొప్ప ఆటగాడి లక్షణమని చెప్పారు. సూర్యవంశీ ఈ జాగ్రత్తలు పాటిస్తేనే అతను ఒక స్టార్‌గా ఎదుగుతాడని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *