కొన్ని యాప్స్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక ఎత్తులు వేస్తున్నాయి. తొలుత నెల లేదా రెండు నెలల పాటు ఉచిత ట్రయల్స్ అందిస్తున్నాయి. దీంతో చాలామంది తమ బ్యాంక్ లేదా కార్డ్ వివరాలు అందించి ఆటో మ్యాండేట్ ఆప్షన్ ఎంచుకుని సబ్ స్క్రైబ్ చేసుకుంటారు. కానీ ఆ తర్వాత ఆటో మ్యాండేట్ గురించి మర్చిపోతుంటారు. దీంతో ఫ్రీ ట్రయల్ అయిపోయాక మీకు తెలియకుండానే అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతుంటాయి. తీరా అకౌంట్ బ్యాలెన్స్ లేదా స్టేట్మెంట్ చూసుకున్నాక అసలు విషయం తెలిసి షాక్ అవుతుంటారు. యాప్ సేవలు ఉపయోగించుకోకపోయినా డబ్బులు కట్ అయ్యాయంటూ ఆందోళన పడుతుంటారు.
ఉచిత ట్రయల్ మోజులో పడకండి
కొన్ని యాప్స్ కస్టమర్లను పెంచుకునేందుకు ఫ్రీ ట్రయల్స్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. వారం, 15 రోజులు, నెల లేదా రెండు నెలల పాటు ఉచితంగా యాక్సెస్ అందిస్తాయి. ఇందుకోసం ముందుగా బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు సేకరించి ఆటో మ్యాండేట్ సెట్ చేసుకోవాల్సిందిగా సూచిస్తాయి. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్‌లో చాలామంది ఈ ఫ్రీ ట్రయల్స్ గడువు తేదీ చూడటం మర్చిపోతుంటారు. దీంతో ఆ తర్వాత అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఫ్రీగా సేవలు పొందటానికి ఉచిత ట్రయల్స్ అనేవి ఉపయోగపడతాయి. తమ ఫ్లాట్‌ఫామ్‌కు వినియోగదారులను అలవాటు చేసుకునేందుకు కంపెనీలు ఫ్రీ ఆఫర్ ఇస్తాయి. గడువు తేదీ ముగిశాక ఇలాంటి మ్యాండేట్‌లను నిలిపివేయాలి. కొంతమందికి వీటిని రద్దు చేయడం ఎలాగో తెలియక ప్రతీ నెలా డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. ఒకవేళ ఆటో మ్యాండేట్ ఫెయిల్ అయితే బ్యాంకులు పెనాల్టీలు కూడా చెల్లిస్తాయి. ఇది మీ క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రభావితం చూపిస్తుంది.
ఆటో మ్యాండేట్ నిలిపివేయడం ఎలా..?
https://upihelp.npci.org.in వెబ్సైట్లోకి వెళ్లండి
– మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
– మీ మొబైల్ నంబర్‌పై ఎన్ని మ్యాండేట్లు ఉన్నాయనేది అక్కడ కనిపిస్తాయి
– కావాలంటే అక్కడే పాజ్ చేసుకోవచ్చు.
– లేదంటే ఆటో మ్యాండేట్‌ను పూర్తిగా క్యాన్సిల్ చేసుకోవచ్చు
-మీరు ఆటో మ్యాండేట్‌కు అనుమతి ఇచ్చిన యాప్‌లోనూ రద్దు చేసుకునే సదుపాయం ఉంది.
యూపీఐ యాప్స్‌లో ఇలా..
-ఫోన్ పే ద్వారా ఆటో మ్యాండేట్ పెట్టుకుంటే.. ఫోన్‌పేలో ప్రొపైల్ పిక్చర్‌పై క్లిక్ చేయాలి. పేమెంట్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆటోపే ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం మీరు దేనిని తొలగించాలనుకుంటున్నారో దానిని ఎంచుకోవాలి. గూగుల్ పేలో కూడా ప్రొఫైల్ పిక్చర్ ఐకాన్ ఎంచుకుని అందులో కనిపించే ఆటో మ్యాండేట్ ఆప్షన్ ద్వారా క్యాన్సిల్ చేసుకోవచ్చు. పేటీఎం విషయానికొస్తే ప్రొపైల్ మెనూలో యూపీఐ/పేమెంట్ సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.