Headlines

Tirumala: తిరుమల వెళ్తున్నారా..? ఇది తెలియకపోతే ఇబ్బందులు తప్పవు


తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలలో అత్యంత విశేష ఘట్టమైన గరుడ వాహన సేవకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం, టీటీడీ సంయుక్తంగా కఠినమైన భద్రతతో పాటు విస్తృతమైన ట్రాఫిక్ ఆంక్షలు, వాహన మళ్లింపులను అమలు చేస్తున్నాయి. గరుడ సేవ సందర్భంగా ఘాట్ రోడ్ పై ద్విచక్ర వాహనాలకు పూర్తి నిషేధం విధించారు. శుక్రవారం రాత్రి 9:00 గంటల నుంచి ఆదివారం ఉదయం 6:00 గంటల వరకు బైకులు, స్కూటర్ల రాకపోకలను అనుమతించరు. భక్తులు తమ ద్విచక్ర వాహనాలను తిరుపతిలోని బాలాజీ లింక్ బస్టాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఎస్వీ మెడికల్ కాలేజ్ గ్రౌండ్, ఇస్కాన్ మైదానం వంటి ప్రత్యేక పార్కింగ్‌ స్థలాల్లో పార్క్ చేసి, ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు చేరుకోవాలి. ప్రైవేటు కార్లు, టూరిస్ట్ బస్సుల కోసం భారతీయ విద్యాభవన్, అలిపిరి లింక్ బస్టాండ్ వంటి ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బస్సులను మళ్లిస్తున్నారు. భక్తులు టీటీడీ, పోలీసుల సూచనలను పాటించి, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని కోరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆంధ్రప్రదేశ్‌ మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఇకపై గ్యాస్ సబ్సిడీ కోసం నో వెయిటింగ్!

ఇక..రేషన్ కార్డ్ ఉంటే చాలు.. ఏపీలో రెసిడెన్స్ సర్టిఫికెట్ కొత్త రూల్స్

బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *