Headlines

Tirumala: చరిత్రలో తొలిసారి.. శ్రీవారికి 121 కేజీల బంగారం కానుక.. వర్ధమాన్ జైన్ ఎవరో తెలుసా..?


Tirumala: చరిత్రలో తొలిసారి.. శ్రీవారికి 121 కేజీల బంగారం కానుక.. వర్ధమాన్ జైన్ ఎవరో తెలుసా..?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిపై భక్తులు తమకున్న భక్తిని వివిధ రూపాల్లో చాటుకుంటారు. కొందరు నగదు రూపంలో కానుకలు సమర్పిస్తే.. మరికొందరు బంగారం, వెండి ఆభరణాలను కానుకగా అందిస్తుంటారు. ఈ క్రమంలో చెన్నైకి చెందిన ఓ పారిశ్రామికవేత్త కుటుంబం శ్రీవారికి భారీ బంగారు కానుకను సమర్పించింది. ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి అందించింది. వీటి విలువ సుమారు రూ.200 కోట్లకు పైమాటేనని తెలుస్తోంది.

చెన్నై పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ కుటుంబం ఈ బంగారు ఆభరణాలను కానుకగా అందించింది. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో దాత కుటుంబ సభ్యులు ఈ ఆభరణాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. తిరుమల చరిత్రలో ఒక భక్తుడు సమర్పించిన అతిపెద్ద బంగారు కానుక ఇదేనని పేర్కొంటున్నారు.

47 రకాల ఆభరణాలు.. 9 ప్రత్యేక సెట్లు

ఈ భారీ కానుకలో మొత్తం 47 రకాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటిని ప్రత్యేకంగా 9 సెట్లుగా తయారు చేయించారు. ఇందులో స్వామివారికి అలంకరించే కిరీటం, వడ్డాణం, భుజాభరణాలు, శంఖుచక్రాలు, అభయ హస్తాలు వంటి ఆభరణాలు ఉన్నాయి. ఆగమ శాస్త్ర నియమాలు, టీటీడీ సంప్రదాయాలకు అనుగుణంగా వీటిని అత్యంత సుందరంగా రూపొందించారు.

స్వామివారి నిత్య అలంకరణ కోసమే..

శ్రీవారు నిత్యం సుమారు 120 కిలోల బంగారు ఆభరణాలను ధరిస్తుంటారు. ఈ నేపథ్యంలో స్వామివారి నిత్య అలంకరణకు ఉపయోగపడేలా సరిగ్గా 121 కిలోల బంగారు ఆభరణాలను దాత కుటుంబం సమర్పించడం విశేషం. రేపటి నుంచే స్వామివారిని ఈ కొత్త ఆభరణాలతో అలంకరించనున్నారు.

గతంలో ఎలక్ట్రిక్ బస్సు విరాళం

శ్రీవారికి ఈ వర్ధమాన్ జైన్ కుటుంబం ఇలా విరాళాలు ఇవ్వడం ఇదే తొలిసారి ఏం కాదు.. ఈ ఏడాది మే 16న కూడా టీటీడీకి ఒక ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించింది. ఇప్పుడు ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. శ్రీవారిపై ఆ కుటుంబానికి ఉన్న అపారమైన భక్తికి ఈ భారీ కానుక నిదర్శనంగా నిలుస్తోంది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *