TG Inter Supply Exams 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. రేపట్నుంచే ఫీజు చెల్లింపులు

TG Inter Supply Exams 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. రేపట్నుంచే ఫీజు చెల్లింపులు


TG Inter Supply Exams 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. రేపట్నుంచే ఫీజు చెల్లింపులు

హైదరాబాద్‌, ఏప్రిల్ 12: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆదివారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్‌లో 66.94 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండియర్‌లో 75.61 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. ఇంటర్ పరీక్షల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 13 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు. వీరితోపాటు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్ధులకు మే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే వారు కూడా రేపట్నుంచే (ఏప్రిల్‌ 13) ఫీజు చెల్లించి అప్లై చేసుకోవల్సి ఉంటుంది.

తెలంగాణ ఇంటర్ ఫలితాలను 2026 ఇక్కడ చెక్‌ చేసుకోండి.

ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసే విద్యార్ధులు సప్లిమెంటరీ పరీక్షలు రాసి తమ మార్కులను ఇంప్రూవ్‌ చేసుకోవచ్చు. ఇక ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 13, 2026వ తేదీ నుంచి నుంచి ప్రారంభం అవుతాయి. రోజుకు రెండు సెషన్స్‌లో మే 22, 2026వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. సప్లిమెంటరీ పరీక్షల ఫీజును ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు చెల్లించవచ్చు. ఇక ఇంటర్‌ ప్రాక్టికల్ పరీక్షలు మే 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్స్‌ కూడా రోజుకు రెండు సెషన్స్‌లో జరగనున్నాయి.

కాగా ఈ ఏడాది ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు 4,89,123 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 3,23,807 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో ఉత్తీర్ణత శాతం 74.40 శాతం ఉండగా వీరిలో బాలురు ఉత్తీర్ణత శాతం 57.69గా ఉంది. ఇంటర్ సెకండ్‌ ఇయర్‌లో మొత్తం 5,07,948 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 3,58,490 మంది (70.58శాతం) ఉత్తీర్ణత పొందారు. ఇందులో బాలికల ఉత్తీర్ణత 78.65 శాతం, బాలుర ఉత్తీర్ణత 62.50 శాతంగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2025లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ఉత్తీర్ణత 66.91 శాతం కాగా.. ఈసారి 66.94 శాతంగా నమోదైంది. 2025లో సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 72.43 శాతం ఉండగా.. ఈ ఏడాది 75.61 శాతంగా నమోదైంది. ఇక జిల్లాల వారీగా చూస్తే తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా 82.73 శాతం మార్కులతో అత్యధిక మంది విద్యార్దులు ఉత్తీర్ణత పొందారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా 58.69 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *