TG Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు 2026 విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ఇదే

TG Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు 2026 విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ఇదే


TG Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు 2026 విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ఇదే

హైదరాబాద్‌, ఏప్రిల్ 12: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్ 12) ఉదయం విడుదల కానున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడి చేయనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ ప్రకటన వెలువరించింది. హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఇంటర్‌ ఫలితలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,97,075 మంది విద్యార్థులు రాశారు. వీరిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు 4,89,126 మంది, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులు 5,07,949 మంది ఉన్నారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026  ఇక్కడ చెక్ చేసుకోండి.

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల 2026 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు జరిగాయి. మార్చి 4 నుంచి మార్చి 30 వరకు మూల్యాంకన ప్రక్రియ కొనసాగింది. ఏప్రిల్‌ రెండో వారంలో ఫలితాలు వెల్లడిస్తామని తొలుత బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 12న ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంటర్ బోర్డు ఆదివారం ఉదయం 11 గంటలకు ఫలితాలను వెల్లడించనుంది. ఫలితాలు విడుదలైన తర్వాత ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తో టీవీ 9 తెలుగు వెబ్‌సైట్‌లోనూ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల 2026 కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

వాట్సప్‌లోనూ ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు..

ఇంటర్‌ విద్యార్థులు తమ తల్లిదండ్రుల వాట్సప్‌ ఫోన్‌ ద్వారా కూడా ఫలితాలను చెక్‌ చేసుకునే సదుపాయాన్ని సర్కార్‌ కల్పిస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌ నుంచి 8096958096 నంబరుకు వాట్సప్‌లో ‘Hi’ అని పంపించాలి. ఆ తర్వాత అందులో వచ్చిన వివరాల ప్రకారం విద్యార్ధులు తమ రోల్‌ నంబరు, సంవత్సరం, గ్రూపు వివరాలు నమోదు చేస్తే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *