Telangana: వాహనదారులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో పెట్రోల్‌ నిల్వలపై కీలక ఆప్‌డేట్

Telangana: వాహనదారులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో పెట్రోల్‌ నిల్వలపై కీలక ఆప్‌డేట్


Telangana: వాహనదారులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో పెట్రోల్‌ నిల్వలపై కీలక ఆప్‌డేట్

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అయిల్ కొరత ఏర్పడింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయడంతో ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. అయితే మన దేశానికి గల్ప్ దేశాల నుంచే పెద్ద మొత్తంలో ఆయిల్ అందుతుంది. ఇప్పుడు ఆదేశాలే ఆయిన్ పరఫరా నిలిపి వేయడంతో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడింది.దీని వల్ల అసలు ఇక పెట్రోల్ దొరకదేమోనని జనాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. సోసల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద మొత్తంలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇందులో ఎంతవరకు నిజముంది అని తెలుసుకునేందుకు తెలంగాణ పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డిని టీవీ9 సంప్రదించింది.

ఈ విషయంపై ఆయన టీవీ9తో మాట్లాడుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ ఉత్పత్తుగా నిలువలు ఉన్నాయి. ప్రజలు ఊరికే భయపడాల్సిన పని లేదని అన్నారు. ప్రస్తుతం ధరలు పెరిగే సమస్య లేదని.. దేశంలో 90 రోజుల వరకు బవర్ స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ఈ పరిస్థిలు ఇలాగే కొనసాగితే కేవలం 30% ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని.. అయినా 70% ఇతర అవకాశాలను వినియోగించుకోవచ్చని తెలిపారు.

ప్రజలు అనవసరంగా భయపడి ఇంట్లో పెట్రోల్ నిలవాలని స్టాక్ చేసుకుంటున్నారని.. ఇది ప్రమాదమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ నిల్వల కంపెనీలు ముందుకు వచ్చి ప్రజలకు స్టేట్మెంట్ ఇవ్వాలన్నారు. గతంలో వార్ జరిగినప్పుడు టైం లిమిట్ తో కస్టమర్లకు భరోసా కల్పించించారని తెలిపారు.

అంతేకాదు ఆయిల్ కంపెనీల నుండి డీలర్లకు ఇప్పటివరకు ఉన్న క్రెడిట్ పేమెంట్ చేయాలని నిబంధనలు పెట్టారు. దీంతో డీలర్ల, ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయని.. ఈ అంశం పైన ఆయిల్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలన్నారు. ప్రభుత్వం ఆయిల్ కంపెనీలు డీలర్ల మీటింగ్ ఏర్పాటు చేస్తే ప్రజలకు ప్రతి సమాచారం అందుతుందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *