Telangana: ఎందుకమ్మా ఇలా చేశావ్..! అమ్మకానికి 18 రోజుల శిశువు.. చివరకు..

Telangana: ఎందుకమ్మా ఇలా చేశావ్..! అమ్మకానికి 18 రోజుల శిశువు.. చివరకు..


Telangana: ఎందుకమ్మా ఇలా చేశావ్..! అమ్మకానికి 18 రోజుల శిశువు.. చివరకు..

చెట్టుకు కాయ బరువా!.. తల్లికి బిడ్డ బరువా!. అన్నది నానుడి. కానీ.. అందుకు భిన్న పరిస్థితులు నేడు సమాజంలో కనిపిస్తున్నాయి. అమ్మ కడుపులో ఆడ పిల్ల ప్రాణం పోసుకుంటోందని తెలిస్తే చాలు.. బాహ్య ప్రపంచాన్ని చూడకముందే ఆ శిశువుకు నిండు నూరేళ్లు నిండుతున్నాయి. పోనీ.. అమ్మ పొత్తిళ్ల నుంచి బయటకు వచ్చాక కూడా ఆ బిడ్డకు రక్షణ ఉండటం లేదు. పేదరిక పరిస్థితుల కారణంగా.. ఆడపిల్ల అంగట్లో బొమ్మలా మారుతోంది. 18 రోజుల ఆడశిశువును కన్నతల్లే అమ్మకానికి పెట్టడం.. ఇప్పుడు సంచలనంగా మారింది.

కామారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. సోమేశ్వర్ గ్రామంలో కేవలం 18 రోజుల పసికందును తల్లి విక్రయించిన ఘటన కలకలం రేపుతోంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. మరోవైపు, అనురాధ అనే మహిళ రూ.లక్షకు ఆ శిశువును కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంగన్‌వాడీ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటన బయటపడగా, పోలీసులు వెంటనే స్పందించి ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారి భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది.

ఆడ‌పిల్ల అంటే ఇంటికి మ‌హాల‌క్ష్మి అని పెద్దలు అంటుంటారు. కానీ అమ్మాయి అంటే స‌మాజంలో ఇప్పటికీ ఓ చిన్నచూపే ! మ‌గ పిల్లాడు పుడితే సంబురాలు చేసుకుంటూ.. ఆడ‌పిల్ల పుడితే భారంగా భావించే వాళ్లు చాలామందే ఉన్నారు. అప్పట్లో ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో అనే వారు.. కానీ ఇప్పుడు మారుతున్న సమాజంలోనూ ఇంకా వెనకటితరంలోనే మగ్గిపోతున్నారు కొందరు. శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి జరుగుతుందని చెప్పుకుంటున్న నేటి రోజుల్లోనూ ఇంకా శిశువులను అంగడి సరుకుల మాదిరిగా విక్రయిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నవమాసాలు మోసి కన్నబిడ్డలను.. అందులోనూ ఆడపిల్లలను తమ అవసరాల కోసం ఆటవస్తువుల్లా అమ్మేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *